• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెంగళూరులో తయారై పాక్ లో...

బెంగళూరులో తయారై పాక్ లో దుమ్ములేపాయి.. ఈ డ్రోన్స్ గురించి తెలుసా?

| పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతికారంతో రగిలిపోయిన భారత్.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది.

By - Tupaki Desk
Update: 2025-05-08 11:30 GMT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ప్రతికారంతో రగిలిపోయిన భారత్.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఈ దాడులతో పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల వణికించేసింది. ఆ సమయంలో భారత్ అమ్ములపొదిలోని సూసైడ్ డ్రోన్స్ ని తొలిసారిగా బయటకు తీసింది! దీంతో.. అవి అరంగేట్రంలోనే అదరగొట్టాయని అంటున్నారు.

అవును.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రమూకలను వణికించేసింది భారత సైన్యం. 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రస్థావరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో విరుచుకుపడ్డాయి. ఈ సమయంలో భారత్.. హ్యూమర్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులతో పాటూ దేశీ సూసైడ్ డ్రోన్లను వాడినట్లు తెలుస్తోంది. వాటి ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం..!

ఇజ్రాయెల్ కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ తో కలిసి బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ (ఏడీటీఎల్) అభివృద్ధి చేసిన స్కైస్ట్రైకర్ "సూసైడ్ డ్రోన్లు".. ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి తమ కార్యచరణను ప్రారంభించాయి! ఈ సమయంలో.. సక్సెస్ ఫుల్ గా లక్ష్యాలని చేదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి!

2021లో ఈ డ్రోన్ లను భారత సైన్యంలోకి చేర్చారు. శత్రు లక్ష్యాలను గుర్తించి, దాడి చేయడానికి రూపొందించిన ఈ డ్రోన్ లు సుమారు 5 నుంచి 10 కిలోల మందుగుండు సామాగ్రిని మోసుకెళ్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఇదే సమయంలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో కదుపుతున్న లక్ష్యాలను చేధించడం వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనే కాకుండా.. పాక్ లోని ఉగ్రస్థావరాలను గుర్తించి దాడి చేయడంలో ఈ సూసైడ్ డ్రోన్లు కీలక భూమిక పోషించినట్లు చెబుతున్నారు. కామికేజ్ డ్రోన్లు అని పిలవబడే ఈ ఆత్మాహుతి డ్రోన్లు కాస్త ఖర్చుతో కూడుకున్నవైనప్పటికీ.. దీర్ఘ శ్రేణి దాడులను చేయగలవని.. సెర్చ్ అండ్ అటాక్ కార్యక్రమాల్లో ఇవి కీరోల్ పోషిస్తయని అంటున్నారు.

Tags:    
  • OperationSindoor 
  • IndiaStrikePOK 
  • Indiamissileattack 
  • IndiaPakistanWar 
  • IndianNavy 
  • IndianAirforce 
  • IndianArmy 
  • MissileStrike 
  • POKTerroristCamps 
  • IndianStrike 
  • SuicideDrones 
  • DefenceNews 
  • IndiaStrikesBack 
  • AntiTerror 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS