'ఆపరేషన్ కగార్' పై కామ్రేడ్ కన్నెర్ర!
'ఆపరేషన్ కగార్' పేరిట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.;
'ఆపరేషన్ కగార్ ' పేరిట కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు-కేంద్ర బలగాల మధ్య జరుగుతోన్న భీకర కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు అసువులు బాస్తున్నారు. మావో మిత్రులు లొంగిపోవాలని కేంద్ర పెద్దలు కోరుతున్నా? మావోలు దిగి రావడం లేదు. శాంతి చర్చలు జరపాలని మావోలు డిమాండ్ చేస్తోన్న కేంద్రం పట్టించుకోకుండా దాడి చేస్తోంది.
ఆపరేషన్ కగార్ పై ఇప్పటికే కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దండకారణ్యం లోని లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్ దిగ్గజాలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తోందని వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివాసీలను అక్కడి నుంచి తరమేసే ప్రక్రియలో భాగంగా మావోయిస్టులను సాకుగా చూపి ఆపరేషన్ కంగార్ మొదలు పెట్టిందని కమ్యునిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా విప్లవ చిత్రాల దర్శకుడు, కామ్రేడ్ ఆర్ . నారాయణమూర్తి కేంద్రం తీరుపై మండి పడ్డారు. ప్రశ్నించే వారిని నక్సలైట్ గా ముద్ర వేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమస్యలపై గళ మెత్తేవారిని అన్నలు అంటూ నిందుస్తున్నారని, తప్పులు చేసినా మౌనంగా ఉండేవారిని ఏమీ అనడం లేదని ఆవేదన చెందారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టు సంఘాల నేతలతో శాంతి చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేసారు.
నారాయణమూర్తి ఎన్నో విప్లవ చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. బడుగు బలహీన వర్గాల సమస్యలను తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేసిన దర్శకుడు. అగ్రకులుం..నిమ్న కులాల నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఎన్నో సినిమాలు చేసారు. కామ్రేడ్ గా నీరాజనాలు అందుకుంటున్నారు. అప్పట్లో నారాయణమూర్తి చేసిన సినిమాలు ఒక్కో డైమండ్ గా పేరొందినవే.