ఏలియన్స్ ఉన్నారా? అమెరికా మాజీ అధ్యక్షుడు ఏం చెప్పారు?

అదే.. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామా లాంటి అధినేత ఒక పాడ్ కాస్ట్ లో క్లియర్ గా చెప్పిన అంశాల్ని చూసిన తర్వాత ఏలియన్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందని చెప్పాలి.;

Update: 2026-02-16 06:00 GMT

ఏలియన్స్.. తరచూ వినిపించే ఈ అంశంపై బోలెడన్ని కథలు.. కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో అసలు నిజం ఎంత? అసలు ఏలియన్స్ అనే అంశానికి సంబంధించి వీసమెత్తు అయినా నిజం ఉందా? అసలు ఇప్పటివరకు ఏలియన్స్ ఉనికిని అగ్రరాజ్యం అమెరికా గుర్తించిందా? ఈ ప్రశ్నల్ని ఎవరిని అడిగినా వారి నుంచి వచ్చే సమాధానంలో వాస్తవం పాళ్లు పరిమితంగా ఉన్నాయని భావించొచ్చు. అదే.. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఒబామా లాంటి అధినేత ఒక పాడ్ కాస్ట్ లో క్లియర్ గా చెప్పిన అంశాల్ని చూసిన తర్వాత ఏలియన్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందని చెప్పాలి.

తరచూ హాట్ టాపిక్ గా.. సంచలనంగా చెప్పుకునే గ్రహాంతరవాసుల మీద ఇప్పటివరకు ఉన్న వాదనల్లో ఏ మాత్రం పస లేదన్న విషయాన్ని ఒబామా తేల్చి చెప్పారు. తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన.. గ్రహాంతరవాసుల గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచచారు. ఏదో ఒక గ్రహంపై గ్రహాంతర వాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పిన ఒబామా.. గ్రహాంతరవాసుల్ని అమెరికా నిర్బంధించిందనే ఊహాగానాల్లో అసలు నిజం లేదని చెప్పేశారు. దీన్ని నిరూపించటానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవుల ఉనికి కనిపించిందన్న నివేదికలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తూ.. గ్రహాంతర వాసుల ఉనికికి సంబందించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తాను పవర్ లో ఉన్నప్పుడు కూడా సమాచారం లేదన్నారు. దీంతో.. గ్రహాంతర వాసుల మీద వినిపిస్తున్న అంచనాలు.. ఊహాగానాల్లో ఏ మాత్రం పస లేదన్న విషయం స్పష్టమైందని చెప్పాలి. గ్రహాంతరవాసులకు సంబంధించి బలంగా వినిపించే ఊహాగానం ఒకటి.. అమెరికాలోని నెవాడలో ఉన్న ఏరియా 51 (ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన సైనికులు, శాస్త్రవేత్తలు ఆయుధాలతో సహా పలు టెక్నాలజీలను పరీక్షిస్తుంటారు. సైనిక శిక్షణ ఇస్తారు) లో ఏలియన్స్ ను నిర్బంధించారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఒబామా.. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశారు.

Tags:    

Similar News