• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పరుగు ఆపనంటున్న...

పరుగు ఆపనంటున్న గడ్కరీ...ప్రధాని రేసులో ఉన్నట్లేనా ?

| కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. లక్ష్మణ్‌రావ్ మాన్కర్ ట్రస్ట్ బాధ్యతలపై చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. మరోవైపు 2029లో బీజేపీకి మెజారిటీ తగ్గితే గడ్కరీ ప్రధాని రేసులోకి వస్తారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-16 04:20 GMT

నితిన్ గడ్కరీ గత పన్నెండేళ్లుగా మోడీ మంత్రివర్గంలో కీలక శాఖలను చూస్తున్న సీనియర్ మంత్రి. ఆయన గతంలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన మహారాష్ట్రకు చెందిన ముఖ్య నాయకుడు. ఆర్ఎస్ఎస్ కి కావాల్సిన మనిషి అని అంటారు. నాగపూర్ ఆయన సొంత ఇలాకా. అదే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న చోటు. అలా చూసినా సంఘ్ కి గడ్కరీకి ఉన్న బలమైన బంధం అర్ధం అవుతుంది. అలాంటి గడ్కరీ సంఘ్ నుంచి బీజేపీలోకి వచ్చి మహారాష్ట్ర నుంచి దేశ రాజకీయాల్లోకి ఎదిగారు. గతంలో సంఘ్ ఆశీస్సులతోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు అంటారు. అలాంటి గడ్కరీ తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు.

మీడియా కల్పితాలు అంటూ :

తాము రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది అని గడ్కరీ ఆగ్రహించారు. తాజాగా ఆయన నాగపూర్‌లో 17వ అగ్రోవిజన్ వ్యవసాయ ప్రదర్శన సన్నాహక సమావేశం తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో తాను చేసిన కొన్ని కామెంట్స్ మీద మీడియా తప్పుగా ప్రసారం చేసింది అని అన్నారు. తాను లక్ష్మణ్‌రావ్ మాన్కర్ ట్రస్ట్ బాధ్యతల గురించి మాట్లాడితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని వక్రీకరించేలా వార్తలు వచ్చాయని అన్నారు. అయితే తాను రాజకీయాల్లో కొనసాగుతాను అని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాని అభ్యర్థిగా :

ఇదిలా ఉంటే బీజేపీలో ప్రధాని రేసులో ఉన్న వారిలో నితిన్ గడ్కరీ ఒకరు అని చెబుతారు. గతంలో కూడా ఆయన పేరు వినిపించింది. అయితే కేంద్ర రాజకీయాల్లో ప్రత్యేకించి బీజేపీలో మోడీ హవా జోరుగా సాగుతోంది. ఇక 2024లో బీజేపీకి 240 దాకానే ఎంపీ సీట్లు దక్కాయి. దాంతో మోడీ మిత్రుల మద్దతుతో మూడోసారి ప్రధాని అయ్యారు. అయితే 2029 లో మాత్రం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నదే చర్చగా ఉంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ సీట్లు వస్తే మోడీ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమని అంటున్నారు. అలా కాకుండా సీట్లు తగ్గిన పక్షంలో మిత్రుల మద్దతు అవసరం పడితే నితిన్ గడ్కరీ లాంటి వారు ప్రధాని రేసులోకి వస్తారు అని అంటున్నారు. అలాంటి ప్రయత్నాలకు ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు లభిస్తుంది అని కూడా చెబుతున్నారు.

గట్టి పోటీదారుగానే :

బీజేపీలో మోడీ తరువాత ఎవరు అంటే యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి పేరుతో పాటు అమిత్ షా పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కానీ నితిన్ గడ్కరీ గట్టి పోటీదారుగా ఉంటారు అన్న ప్రచారం కూడా ఉంది. ఆయన దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన వారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ మద్దతు ఉన్న నేతగా బీజేపీలో సర్వామోదం లభిస్తుంది అని చెబుతున్నారు. ఇక ఎన్డీయే మిత్ర పక్షాలతో సైతం ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు విపక్ష నేతలతో కూడా సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రచారాలు ఊహాగానాల సంగతి ఎలా ఉన్న నితిన్ గడ్కరీ తాను ఇప్పట్లో రిటైర్ కాను అని తేల్చి చెప్పడంతో ఆయన భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

Tags:    
  • nitingadkari 
  • narendramodi 
  • bjp 
  • rss 
  • indianpolitics 
  • 2029elections 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS