నెతన్యాహును చూసి మోడీ నేర్చుకోవాల్సిందెంతో?

ఇరాన్ పై నిప్పుల వర్షం లాంటి ఆయుధాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.;

Update: 2025-06-17 04:30 GMT

శత్రువును దెబ్బ తీయాలంటే ఎలా? తాము చేసే పనికి ప్రపంచం ఏమనుకున్నా.. ప్రపంచానికి పెద్దన్న మద్దతు ఎలా సొంతం చేసుకోవాలి? కారణం ఏమైనా యుద్ధానికి కాలు దువ్వినప్పటికి నోరు తెరిచి ఎవరూ మాట్లాడలేని పరిస్థితిని ఎలా క్రియేట్ చేయాలి? తమకు శత్రువైనా ఒక దేశాధ్యక్షుడ్ని చంపేస్తేనే పరిస్థితి చక్కబడుతుందన్న సంచలన.. షాకింగ్ వ్యాఖ్యలు చేయగలిగిన సత్తా ఎవరికి ఉంది? లాంటి ప్రశ్నలకు వచ్చే ఏకైక సమాధానం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు.

ఇరాన్ పై నిప్పుల వర్షం లాంటి ఆయుధాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా జరుగుతున్న యుద్ధం రెండు దేశాలకే పరిమితం కాకుండా.. ప్రపంచాన్ని ప్రభావితం చేసేదే అయినప్పటికి.. నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. అయితే.. ఇజ్రాయెల్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం లేదంటే నోరు విప్పి మాట్లాడేందుకు సుతారం ఇష్టపడని పరిస్థితి ఆసక్తికరంగా చెప్పక తప్పదు.

కారణం.. ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలు.. సాంకేతికత.. అన్నింటికి మించి అగ్రరాజ్యం అమెరికా నుంచి సంపూర్ణ సహకారంతో పాటు.. నీ వెంట మేం ఉన్నాం. మీరేం చేసినా మేం చూసుకుంటామన్న ధీమానే వీటికి కారణం. తాజాగా మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. టెహ్రాన్ పై టెల్ అవీవ్ చేస్తున్న దాడుల్ని సమర్థించిన ఆయన.. ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచే కన్నా యుద్ధాన్ని త్వరగా ముగించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ఇరాన్ పై తమ దాడుల్ని సమర్థించుకుంటూ మాట్లాడిన నెతన్యాహు.. తాను మాట్లాడే ప్రతి మాటలోనూ అమెరికా ప్రయోజనాల కోసం తాము యుద్ధం చేస్తున్నామని.. అమెరికా తరఫున తాము పోరాడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అందుకు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆయనేమన్నారన్నది ఆయన మాటల్లోనే చదివితే శత్రు దేశాన్ని మరే దేశమైనా టార్గెట్ చేస్తే.. అగ్రరాజ్యం అండ ఎలా రావాలన్న దానికి నెతన్యాహు ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఆపరేషన్ సింధూర్ వేళ పాక్ ను ఒంటరి చేసేందుకు మరింత వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని ప్రధాని మోడీ ఇజ్రాయెల్ ప్రధాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.

ఇంతకూ ఇరాన్ మీద తాము చేసిన దాడుల్ని సమర్థించుకుంటే.. ఇదంతా చేసింది అమెరికా కోసం కూడా అన్న భావన కలిగేలా చేసిన నెతన్యాహు వ్యాఖ్యల్లోకి వెళితే..

- మేం కేవలం మా శత్రువుతో మాత్రమే యుద్ధం చేయటం లేదు. వారు ఇజ్రాయెల్ కు.. అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారు. మేం సైతం వారి దారిలోనే నడుస్తున్నాం.

- వారి తీరు త్వరలో అమెరికాకు చేరుతుంది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్దాన్ని అడ్డుకోవటానికి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది.

- ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్దం ప్రపంచాన్ని అణు విపత్తు వైపు నెడుతోంది. దురాక్రమణను అంతం చేయటం.. దుష్ట శక్తులకు ఎదిరించి పోరాడటం లాంటి వాటితో ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటోంది.

- ఇరాన్ అణు కార్యక్రమం హిట్లర్ అణు టీంలాంటిది. వారితో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉంది.

- ఇరాన్ ద్రష్టిలో అమెరికానే తొలి లక్ష్యం. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది.

- అర శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతి ఒక్కరూ భయపడే విధంగా తయారైంది.

- సౌదీలోని అరామ్ కో చమురు క్షేత్రాలపైనా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి.. విధ్వంసం.. వ్యవస్థలను బలహీనం చేయటం పెరిగిపోయింది.

- ఇరాన్ దౌత్య చర్యలు తప్పుదారి పట్టించేవి. వారు అబద్ధాలు.. మోసంతో నకిలీ చర్చలు చేస్తున్నారు. అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారు.

- ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ.. అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్ కు మాత్రమే ముప్పు కాదు.అరబ్ దేశాలు.. యూరప్.. అమెరికాకు సైతం ముప్పే.

- కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి. దాన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు అండగా నిలబడ్డారు.

Tags:    

Similar News