నవనీత్ కౌర్ వర్సెస్ ఒవైసీ... మధ్యలో 15 నిమిషాలు - 1 గంట!

ఈ క్రమంలో తాజాగా.. బీజేపీ నేత, అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్ రాణా.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Update: 2024-05-09 13:21 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇందులో ప్రధానంగా ఎంఐఎం - బీజేపీ మధ్య వాతావరణం పీక్స్ కి చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఆ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలోనే... నవనీత్ కౌర్ వర్సెస్ ఒవైసీ టాపిక్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవును... తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. ఈ క్రమంలో తాజాగా.. బీజేపీ నేత, అమరావతి ఎంపీ నటి నవనీత్ కౌర్ రాణా.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఇందులో భాగంగా... మే 8న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నవనీత్ కౌర్ హైదరాబాద్‌ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా... "పోలీసులు 15 నిముషాల పాటు పక్కకు తప్పుకుంటే అందరి లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.. కానీ వాళ్లకు 15 నిముషాలు కావాలేమో... మాకు 15 సెకన్లు చాలు" అని నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు ఒవైసీ స్పందిస్తూ... "మోడీజీకి చెబుతున్నా.. ఆమెకు 15 సెకన్లు కాదు ఒక గంట సమయం ఇస్తున్నాం.. ఆ ఏం చేస్తారో? మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం. ఎవరూ భయపడరు ఇక్కడ? మేం సిద్ధంగా ఉన్నాం... సవాల్ చేసివాళ్లు దానిపై నిలబడాలి. ప్రధాని పదవి మీదే.. ఆర్.ఎస్.ఎస్. అంతా మీదే. ఏం చేస్తారో చేసుకోండి.. ఎక్కడికి రావాలో చెప్పండి" అని ఛాలెంజ్ విసిరారు.

Read more!
Tags:    

Similar News