మోడీ మన్ కీ బాత్ లో నరసాపురం టాపిక్.. స్పెషల్ ఇదే!

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ లో తాజాగా ప్రసంగించారు.;

Update: 2025-12-28 17:29 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్ లో తాజాగా ప్రసంగించారు. ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ అయిన ఈ కార్యక్రమంలో ఈ ఏడాదిలో భారత్ సాధించిన విజయాలను, గర్వించదగిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ నుంచి మహా కుంభమేళా వరకూ అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ.. నరసాపురం టాపిక్ కూడా ఎత్తడం గమనార్హం.

అవును... ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ తో భారత్ ప్రపంచ దేశాలకు తన బలాన్ని చూపించిందని.. దేశ భద్రతపట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని.. ప్రతిపౌరుడికి గర్వకారణంగా మారిందని అన్నారు.

ఇదే సమయంలో... 12 ఏళ్ల తర్వాత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మొదటిసారి మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్‌ ను గెలుచుకుందని.. మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని మోడీ గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాను ప్రశంసించారు.

ఇదే క్రమంలో... కోట్లాది మంది పాల్గొన్న మహా కుంభమేళాను.. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమాన్ని.. ఈ ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రస్థావన తెచ్చారు. అందుకు కారణం... ఇక్కడున్న లేస్ క్రాఫ్ట్ కావడం గమనార్హం!

ఈ సందర్భంగా... నరసాపురం లేస్ క్రాఫ్ట్ గురించి ప్రస్థావించిన ప్రధాని మోడీ.. ప్రస్తుత మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లేస్ క్రాఫ్ట్ చర్చనీయాంశంగా మారిందని అన్నారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన కళను కాపాడుతూ వస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం నాబార్డ్ తో కలిసి ఎంతో ప్రోత్సహిస్తుందని.. ప్రస్తుతం దీని మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు.

మోడీకి లోకేష్ కృతజ్ఞ్తలు!:

ఈ ఏడాది చివరి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నరసాపురం లేస్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతూ.. దానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా... ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నరసాపురం లేస్ కళలోని శాశ్వత సౌందర్యాన్ని, దాని వెనుక ఉన్న శ్రమను ప్రధాని గౌరవించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ లేస్ క్రాఫ్ట్ ద్వారా లక్షకు పైగా మహిళలు జీవనోపాధి పొందుతున్నారని.. నాబార్డ్, స్కిల్ డెవలప్మెంట్ తో దీన్ని మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు!

Tags:    

Similar News