• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నారా నందమూరి... ఏమి...

నారా నందమూరి... ఏమి జరుగుతోందసలు...?

| అలాంటి బాలయ్య బావ చంద్రబాబు జైలులో ఉంటే తాను హైదరాబాద్ లో తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటూ వస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-16 08:17 GMT

నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ రెండు ఇంటి పేర్లూ ఎన్ అన్న అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. ఇక బాలయ్య బాబు బావా బావమరుదులు. పాలూ నీళ్ళుగా ఉంటూ వచ్చారు. కానీ ఒక్క బాబు అరెస్ట్ మాత్రం నారా నందమూరి మధ్యలో కొంత గ్యాప్ పెంచిందా అన్న చర్చ తెర మీదకు వస్తోంది. బాలయ్య విషయం తీసుకుంటే బోళా మనిషి. ఆయనకు కళ్ళకు కనిపించేంత వరకు ఏది అయినా గట్టిగా నమ్మేస్తారు.

ఒకసారి కంటికి కనిపించినది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మాత్రం దానిని అలాగే ఉంచేసుకుంటారు. ఇపుడు అదే జరుగుతోంది అని అంటున్నారు. నిజానికి నారా నందమూరి ఫ్యామిలీస్ మధ్యన పొరపొచ్చాలు అయితే లేవు అనే అంటున్నారు. బాలయ్య కూతురుని చంద్రబాబు కుమారుడికి చేసుకున్నారు. రెండూ ఒక్కటే అన్నట్లుగా ఉన్నారు.

బాబుకు ఆరు నూరు అయినా బిగ్గెస్ట్ సపోర్ట్ బాలయ్య. అలాంటి బాలయ్య బావ చంద్రబాబు జైలులో ఉంటే తాను హైదరాబాద్ లో తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంటూ వస్తున్నారు. నిజమే కమిట్ అయిన సినిమా కోసం కష్టపడాల్సిందే. అదే టైం లో టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉండగా వీకెండ్స్ లో చేపట్టిన సౌండ్స్. లైట్స్ ఆర్పడం, సంకెళ్ళు కార్యక్రమంలో బాలయ్య ఫ్యామిలీ ఎక్కడా కనిపించలేదని ప్రచారం సాగుతోంది.

దానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. బాలయ్య నిజానికి చంద్రబాబు తరువాత టీడీపీకి తానే అని అనుకున్నారని అంటారు. చంద్రబాబు వయసుని, ఆన అనుభవాన్ని బాలయ్య ఎంతగానో గౌరవిస్తారు. బాబు తరువాత మాత్రం తానే అన్నది ఆయన నమ్మకం, భవన. అందుకే చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కొత్తల్లో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్ళి హడాదుడి చేశారు. బాబు అరెస్ట్ వల్ల మరణించిన వారిని పరామర్శిస్తాను అని కూడా అన్నారు.

అయితే ఆ తరువాత బాబుతో జైలులో ములాఖత్ తరువాత బాలయ్యకి కొంత తెలిసి వచ్చింది అని అంటారు. పవన్ కళ్యాణ్ణి కీలకం చేసి ఆయనతో పొత్తు ప్రకటనలు ఇప్పించడం ఆ తరువాత టీడీపీలో సీనియర్లు అందరినీ కలిపి యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం అందరిలో ఒకడిగా బాలయ్యను అక్కడ చేర్చడం వంటివి చూసిన తరువాతనే బాలయ్య కొంత దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు.

ఏపీ రాజకీయాలతో పని లేదని తెలంగాణా రాజకీయాలు చూసుకోమని కూడా బాలయ్యకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది అని అంటున్నారు. దాంతోనే బాలయ్య తన పనేంటో తానేంటో అన్నట్లుగా సినిమా ఫంక్షన్ లో బిజీ అయ్యారని అంటున్నారు. ఇక తన సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో బాలయ్య ఇంకా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ మీదట కూడా ఆయన టీడీపీ పాలిటిక్స్ లో యాక్టివ్ కాకపోతే మాత్రం కచ్చితంగా నారా నందమూరి ఫ్యామిలీస్ మధ్యన గ్యాప్ ఏదో వచ్చినట్లే అని భావించాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఇదిలా ఉండగా న్యాయానికి సంకెళ్ళు పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో నారా లోకేష్ బ్రాహ్మణి సంకెళ్ళు వేసుకున్నారు. ఆ ఫోటోలు రిలీజ్ చేశారు. భువనేశ్వరి రాజమండ్రిలో సంకెళ్ళు వేసుకుని ఫోటోలు రిలీజ్ చేశారు. ఎక్కడా నందమూరి నుంచి ఫోటోలు మాత్రం రాలేదు అని గుర్తు చేస్తున్నారు.

ఇక తన అక్క బ్రాహ్మణిని మోక్షజ్ఞ పరామర్శించలేదని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే బాలయ్య సతీమణి వసుంధర కూడా టీడీపీ నిరసనల్లో ఎందుకు పాల్గొనడం లేదు అని ప్రశ్నలు వేస్తున్న వారూ ఉన్నారు. బాలయ్య తరఫున హిందూపురంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటారు. అలాంటిది కష్టంలో చంద్రబాబు జైలులో ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు. అన్న చర్చ సాగుతోందిట. మొత్తానికి చంద్రబాబు జైలులో ఉన్నా కూడా బాలయ్య చేతికి పార్టీ పగ్గాలు దక్కపోవడం పట్ల నందమూరి ఫ్యామిలీలో కూడా ఆవేదన వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Narafamily 
  • Nandamurifamily 
  • Balakrishna 
  • Chandrababu 
  • Cbnjail 
  • Balayyamoviepromotions 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS