లోకేష్ రాజకీయాల మీద బాబు కామెంట్స్ వైరల్
ఏపీలో ఎదుగుతున్న రాజకీయ నేతగా మంత్రి నారా లోకేష్ ని అంతా చెప్పుకుంటారు. ఇపుడు ఏపీలో ఏ చర్చ అయినా లోకేష్ గురించే సాగుతూ వస్తోంది.;
ఏపీలో ఎదుగుతున్న రాజకీయ నేతగా మంత్రి నారా లోకేష్ ని అంతా చెప్పుకుంటారు. ఇపుడు ఏపీలో ఏ చర్చ అయినా లోకేష్ గురించే సాగుతూ వస్తోంది. నవ యువకుడిగా ఉన్న ఆయన ఆలోచనలు కొత్తదనంతో కూడుకున్న వైఖరి ఆయన దృక్కోణం ఏపీకి మేలు చేస్తుందని అంటున్న ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. యువతరం ప్రతినిధిగా లోకేష్ కనిపిస్తున్నారు. దాంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువగా రొటీన్ విధానాలకు చెక్ చెప్పి సంస్కరణల దిశగా అడుగు వేయడం లోకేష్ పట్ల పాజివిటీని పెంచుతున్నాయి. దాంతో టీడీపీ వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూంటే టీడీపీ అధినేతగా లోకేష్ తండ్రిగా చంద్రబాబు ఆలోచనలు ఏమిటి అన్న ఉత్కంఠ అందరిలో ఉంటుంది.
ఫోర్స్ చేయలేదని :
తాను లోకేష్ ని మంచిగా చదివిందాను అని బాబు భామినిలో జరిగిన పేరేంట్స్ టీచర్స్ మీట్ లో చెప్పారు. లోకేష్ ని విద్యావంతుడిగా చేశామని అన్నారు. అదే సమయంలో ఆయన ఏ రంగంలో స్థిరపడాలన్నది తాను ఒత్తిడి చేయలేదని బాబు కొత్త విషయం చెప్పారు. ముఖ్యంగా రాజకీయల్లోకి లోకేష్ రావాలని తాను ఏ మాత్రం ఫోర్స్ చేయలేదని చంద్రబాబు చెప్పడం విశేషం. అయితే లోకేష్ తానుగానే వచ్చారని బాబు చెప్పుకొచ్చారు. అంతే కాదు ఎంతో కష్టమైన విద్యా శాఖను ఎంతో ఇష్టంగా లోకేష్ తీసుకుని ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు అని బాబు చెప్పారు.
లోకేష్ లో ఆసక్తి :
మరి చంద్రబాబు రాజకీయాల్లోకి లోకేష్ ని రమ్మని కోరకపోతే ఆయనలో ఆసక్తి ఎలా ఏర్పడింది అన్నదే ఇక్కడ చర్చ. అయితే ఇంట్లో దిగ్గజ నేత చంద్రబాబు వంటి వారు రాజకీయాల్లో ఉండగా కుమారుడు లోకేష్ మీద ఆ ప్రభావం కచ్చితంగా పడుతుందని అంటున్నారు. అందుకే తండ్రికి బాసటగా లోకేష్ 2009 మొదట్లో తెర వెనక నుంచి రాజకీయాలు నెరిపారు. అయితే 2014 తరువాత మాత్రం ఆయన ముందుకు వచ్చారు. 2017లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు అని అంటున్నారు.
బరువైనదే :
ఇక బాబుకు రాజకీయ వారసుడు అన్నది ఎంతో బరువైన బాధ్యత. దానిని లోకేష్ ఎంతో సమర్ధంగా స్వీకరించి మరీ నెగ్గుకు వస్తున్నారు అని అంటున్నారు. ప్రతీ విషయంలో బాబుతో ఎవరైనా పోలుస్తారు. అయితే లోకేష్ తండ్రి స్పూర్తిని తీసుకుని తనదైన కొత్త ఆలోచనలతో ముందుకు సాగడం ద్వారా తగిన వారసుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా లోకేష్ పనితీరు మీద ఈ మధ్యనే జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో సానుకూలంగా స్పందించిన బాబు ఆయన రాజకీయ ప్రవేశం మీద ఆ మీదట ఆయన పట్టుదలగా పైకి వస్తున్న తీరు పట్ల ఒక అధినాయకుడిగా తండ్రిగా కూడా బాగానే మార్కులు వేస్తున్నారు అనుకోవాలని అంటున్నారు.