దేవాన్ష్ ని ముద్దు చేసిన మోడీ

ఈ సందర్భంగా లోకేష్ దంపతుల యోగ క్షేమాలను కూడా ప్రధాని మోడీ ఆరా తీసినట్లుగా తెలిసింది. అంతే కాదు వారి ఏకైక కుమారుడు దేవాన్ష్ ని ప్రధాని ముద్దు చేశారు.;

Update: 2025-05-17 17:26 GMT

రావయ్యా ఒక్కసారి అని ఎంతో ఆప్యాయంగా ఒక దేశ ప్రధాని ఒక బలమైన ప్రాంతీయ పార్టీ యువ. నాయకుడిని పిలిస్తే అది రాజకీయాల్లో వార్త కాకుండా ఉంటుందా. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నారా లోకేష్ భేటీ అన్నది రాష్ట్ర రాజకీయాలలో సంచలన వార్తగా నిలిచింది. .

లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా చాలా చురుకుగా పనిచేస్తున్నారు. టీడీపీ బాధ్యతలనూ మరో చేత్తో చక్కబెడుతున్నారు. ఈ నేపధ్యంలో యువ నేతగా ఏపీలో చాలా వేగంగా ఎదుగుతున్న్న లోకేష్ ని చూసి ముచ్చట పడ్డారో ఏమో తెలియదు కానీ ప్రధాని మోడీ ఒకటికి రెండు సార్లు ఆయన తన వద్దకు రావాలని బలంగా కోరుకున్నారు.

దాంతో పాటీ ఈ శనివారం వారాంతంలో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక కుటుంబ సమేతంగా లోకేష్ ఢిల్లీలో ప్రధాని వద్దకు వెళ్ళారు. తన వద్దకు వచ్చిన లోకేష్ ని ఎంతో ఆప్యాయంగా పలకరించిన మోడీ ఆయన కుటుంబ సభ్యులను కూడా పలకరించారు.

ఈ సందర్భంగా లోకేష్ దంపతుల యోగ క్షేమాలను కూడా ప్రధాని మోడీ ఆరా తీసినట్లుగా తెలిసింది. అంతే కాదు వారి ఏకైక కుమారుడు దేవాన్ష్ ని ప్రధాని ముద్దు చేశారు. ఎంతో ఆప్యాయంగా తన దగ్గరకు తీసుకుని మరీ ముచ్చటించారని భోగట్టా.

ఈ భేటీ సందర్భంగా లోకేష్గ్ కుటుంబపరమైన విషయాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా వీరిరువురి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా ఉంది. మొత్తానికి ప్రధానితో కుటుంబ సమేతంగా జరిగిన లోకేష్ భేటీ చాలా అహ్లాదకర వాతావరణంలో సాగింది అని అంటున్నారు.

లోకేష్ లోని నాయకత్వ లక్షణాలు దీక్షా దక్షతలు అన్నీ బీజేపీ పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంతా అంటున్నారు. లోకేష్ మరింతగా రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీ పెద్దల నిండు దీవెలకు ఉంటాయని కూడా అంతా అంటున్నారు. మొత్తానికి ప్రధానితో లోకేష్ భేటీ ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు తీసుకుని రానుందని అంటున్నారు.

Tags:    

Similar News