నాగబాబు పంచ్...ఆ పార్టీ మీదేనా...!?

వదిన అంటూ ఆయన వదిలిన ఈ పోస్టర్ ఏ పార్టీని టార్గెట్ చేసిందో వేరే చెప్పనక్కరలేదు అని అంటున్నారు.

Update: 2024-02-29 13:56 GMT

జనసేన నేత సినీ నటుడు నాగబాబు లేటెస్ట్ గా ఒక పంచ్ వేశారు. దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. తనకు బాగా ఇష్టమైన పాత సినిమా వదిన అంటూ అక్కినేని సావిత్రి ఉన్న అలనాటి పోస్టర్ ని ఆయన ట్వీట్ చేసి మరీ వదిలిపెట్టారు. నాగబాబు ఈ విధంగా పోస్టర్ ని వదలడం ద్వారా ఒక పార్టీని గురి పెట్టారు అని అంటున్నారు.

తాడేపల్లిగూడెంలో చంద్రబాబు పవన్ నిర్వహించిన జెండా బహిరంగ సభలో పవన్ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన జగన్ ని పట్టుకుని నాలుగవ పెళ్లాం నీవే అంటూ ఆవేశంగా మాట్లాడారు. దాంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. జనసైనికులు పవన్ అన్నకు వదిన అంటూ వైసీపీని ర్యాగింగ్ చేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా అంతా పూనకాలు పోతున్న వేళ నాగబాబు సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. వదిన అంటూ ఆయన వదిలిన ఈ పోస్టర్ ఏ పార్టీని టార్గెట్ చేసిందో వేరే చెప్పనక్కరలేదు అని అంటున్నారు. జనసేన సోషల్ మీడియా వారికి మద్దతుగానే నాగబాబు ఇలా ట్వీట్ చేశారు అని అంటున్నారు.

 

నాగబాబు ఇపుడు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దాంతో ఆయన ఈ విధంగా తనదైన శైలిలో వైసీపీని ఆడుకుంటున్నారు అని అంటున్నారు. తన తమ్ముడు అన్న మాటలకు సమర్ధనగా జనసైనికుల సోషల్ మీడియా యుద్ధానికి మరింత మద్దతుగా నాగబాబు ఈ ట్వీట్ వేసారని అంటున్నారు.

Read more!

మరో వైపు చూస్తే నాగబాబు ఈ విధంగా చేయడం కొత్త కాదు అని అంటున్నారు. గతంలో కూడా ఆయన సినీ నటుడు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ పాతకాలం హస్యనటుడు అంజి బాలక్రిష్ణ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి బాలయ్య ఫ్యాన్స్ కి మంట పుట్టించారు.

ఇలా నాగబాబు తరచూ ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ విధంగా పంచులు పేలుస్తూ ఉంటారు. అయితే ఇపుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన వైసీపీల మధ్య సోషల్ మీడియాలో ఇపుడు ఒక స్థాయిలో యుద్ధమే సాగుతోంది. నాగబాబు కూడా ఈ పంచ్ వేయడం ద్వారా తాను కూడా ఉన్నాను అని చెప్పేశారా అని అంటున్నారు.

వైసీపీ నేతలు అయితే రోజంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూనే ఉన్నారు. ఆయనకు సోయి లేదా అని వైసీపీ అధికార సోషల్ మీడియాలోనే విమర్శలు చేసింది. మంత్రులు మాజీ మంత్రులు కూడా విమర్శలు రాజేశారు. ఇపుడు నాగబాబు వదిన పోస్టర్ కి అలాగే పెట్టిన ట్వీట్ కి ఏ విధంగా వైసీపీ రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News