ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు... జగన్ కి మోడీ మార్క్ షాక్ !

ఏపీకి గతంలో వచ్చిన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ ని ఏమీ అనలేదని వైసీపీలో ఒక రకమైన సంబరం కనిపించింది.;

Update: 2024-05-03 04:03 GMT

ఏపీకి గతంలో వచ్చిన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ ని ఏమీ అనలేదని వైసీపీలో ఒక రకమైన సంబరం కనిపించింది. టీడీపీ కూటమిలో మరో రకమైన నిర్వేద స్వరం వినిపించింది. కట్ చేస్తే తాజాగా ఒక ప్రముఖ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుండబద్ధలు కొట్టారు.

ఏపీలో రాజకీయం తమకు అనుకూలం అన్నారు. అంటే దాని అర్ధం టీడీపీ కూటమికి అక్కడ రాజకీయం కలసి వస్తుందని ఆయన చెప్పినట్లు అన్న మాట. అంతే కాదు ఏపీ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అని ఒక బాంబు లాంటి వార్తను వినిపించారు. దాని అర్ధం జగన్ పాలన బాగా లేదని చెప్పినట్లే అంటున్నారు. జగన్ గద్దే దిగక తప్పదన్నది కూడా అందులో స్పురించే ఇంకో భావన.

ఇక ఏపీ గురించి ప్రధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తాము మిత్రపక్షాలను కలుపుకొని వెళతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అంటే తెలుగుదేశం జనసేనలతో కలసి వైసీపీ మీద రాజకీయ యుద్ధం చేస్తున్నట్లుగా ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.

దీనిని బట్టి చూస్తే కనుక ప్రధానమంత్రి ఇక మీదట వైసీపీ మీద తన బాణాలను ఎక్కుపెడతారు అన్నది రూడీ అయిపోయింది అంటున్నారు. ఈ నెల 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు ఏపీలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచార సభలూ రోడ్ షోలు ఉన్నాయి. ఈ సందర్భంగా మూడు బహిరంగ సభలను ఆయన మూడు ప్రాంతాలలో నిర్వహిస్తున్నరు. రాయలసీమకు సంబంధించి పీలేరులో గోదావరి జిల్లాలకు సంబంధించి వేమగిరిలో, ఉత్తరాంధ్రాకు సంబంధించి అనకాపల్లిలో మోడీ సభలు ఏర్పాటు చేశారు.

ఈ సభలలో మోడీ వైసీపీ మీద దూకుడు చేస్తారని అంటున్నారు. ఇండియా టూడే ఇంటర్వ్యూలో ఆయన మనసులోని మాటను చెప్పారు అంటున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. దాని అర్ధం జగన్ మాజీ సీఎం కావడమే అంటున్నారు. ఆయన మాటల తూటాలు జగన్ మీద మోడీ మార్క్ పంచులు ఈసారి ఏపీ సభలలో చూడవచ్చు అని అంటున్నారు.

గతంలో చంద్రబాబుని ఉద్దేశించి పోలవరం ఏటీఎం లా మార్చుకున్నారు అని తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి జగన్ మీద ఎలాంటి విమర్శలు చేస్తారు అన్న ఉత్కంఠను మాత్రం తెర లేచింది. ఆయన ఏపీ రాజకీయాల మీద వైసీపీ ప్రభుత్వం మీద ఏపీ ప్రజల నాడి మీద తనదైన విశ్లేషణను ఈ ఇంటర్వ్యూ ద్వారా వినిపించారు అని అంటున్నారు.

ఇదంతా జస్ట్ ఒక ట్రైలర్ అని అసలైన సినిమా ఏపీలో రాజకీయ వేదికల మీదనే మోడీ చూపిస్తారు అని అంటున్నారు. మరి దీనిని బట్టి చూస్తే మార్చి 16న చిలకలూరి సభకూ ఇప్పటికి మార్పు ఎలా వచ్చింది కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాల వద్ద ఏపీలో వైసీపీ గ్రాఫ్ తగ్గింది అన్న సమాచారం ఏమైనా వచ్చిందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి మోడీ జగన్ మీద డైరెక్ట్ అటాక్ ఏ విధంగా చేస్తారు అన్నది చూసేందుకు వినేందుకు వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News