• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చంద్రబాబు తెచ్చే అప్పులను...

చంద్రబాబు తెచ్చే అప్పులను పచ్చ మీడియా చూపించదా ?

| ఏపీ అప్పుల కుప్ప అని ప్రతీ రోజూ కనిపించే హెడ్ లైన్స్ ఇపుడు కనుమరుగు అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-09-18 09:30 GMT

ఏపీ అప్పుల కుప్ప అని ప్రతీ రోజూ కనిపించే హెడ్ లైన్స్ ఇపుడు కనుమరుగు అయ్యాయి. వైసీపీ అయిదేళ్ల పాలనలో ఏపీ శ్రీలంక అవుతుందని పాకిస్థాన్ లా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటుందని ఎన్నో భయానక స్టోరీలు రాసి కోట్లాది ప్రజలను కలవరపరచే మీడియా మోతుబరులు ఇపుడు నిర్లిప్తంగా కూర్చున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏపీ ఏమైపోతేనేమి అన్న వేదాంతమా లేక ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అన్న నిబ్బరమా లేక ఏపీలో ఇపుడు అస్మదీయ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని జోలికి పోవద్దు అన్న ముందు జాగ్రత్త తో కూడిన విధేయతా అన్నది కూడా ప్రశ్నోప ప్రశ్నలుగా జనంలో ఉన్నాయి.

ఏపీకి పది లక్షల కోట్ల అప్పు ఉంది అని పాడిన పాటే కూటమి పెద్దలు పాడుతున్నారు. అందులో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల వాటా ఎంత అన్నది కూడా అయిదు కోట్ల మంది ప్రజలకు తెలియాలి కదా అని అంటున్నారు. ఏపీ ప్రజలకు రాష్ట్రం మీద సర్వ హక్కులు ఉన్నాయి.

పార్టీలు ప్రభుత్వాలు మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి. ఇక కట్టే పన్ను నుంచే ఖజానాకు ఆదాయం వస్తుంది అలాంటిది ఏపీకి ఉన్న ఆదాయం ఎంత అప్పులు ఎంత అన్నది నిజాయితీతో కూడిన బ్యాలెన్స్ షీట్ ప్రజలకు ఎప్పటికపుడు తెలియాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

ఏపీకి ఉన్న అప్పులు ఎన్ని బాబు గారి మూడు నెలల పాలనలో తెచ్చిన అప్పులు ఎంత అన్న దాని మీద వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నలతో చెడుగుడు ఆడేశారు. పచ్చ మీడియా చంద్రబాబు అప్పుల గురించి చూపించదా అని ఆయన నిగ్గదీస్తూనే చంద్రబాబు సీఎం అయ్యాక తెచ్చిన అప్పులు ఎన్నో డిటైల్డ్ రిపోర్టునే ఇస్తున్నారు.

ఏపీ అంటే అప్పు అని మంగళవారం అప్పు అని రాష్ట్రం శ్రీలంక కాబోతోంది అని ప్రతీ రోజూ పెద్ద అక్షరాలతో రాసే పచ్చ మీడియా ఇపుడు ఏమీ రాయకపోవడమేంటి అని ఆయన మండిపడ్డారు. ఏపీలో గడచిన నాలుగు నెలలలో బాబు గారు చేసిన అప్పు లిస్ట్ ని బుగ్గన మీడియా సమావేశంలో చదివి వినిపించారు.

జూన్ 11లో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అని ఆయన చెప్పారు. ఇక ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయల అప్పుని ఏపీ కూటమి ప్రభుత్వం గడచిన నాలుగు నెలలలో తెచ్చిందని ఆయన చెప్పారు. అందులో జూలై 2న అయిదు వేల కోట్లు తెచ్చారని, అలాగే జూలై 16వ తేదీ రెండు వేల కోట్ల అప్పు, జూలై 30వ తేదీ మూడు వేల కోట్ల అప్పు ఆగస్టు 27వ తేదీ మూడు వేల కోట్లు అప్పు, సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల కోట్ల అప్పు చేసారని బుగ్గన వెల్లడించారు.

రాష్ట్రం పట్ల ఎంతో అభిమానం అంకితభావం కలిగిన వారుగా చెప్పుకుంటూ కొన్ని మీడియా సంస్థలు ఏపీ అప్పుల పాలు అని గొంతు చించుకున్నారని ఇన్నేసి వేల కోట్ల అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తూంటే ఎక్కడైనా ఏ పేపర్ లో అయినా ఏ న్యూస్ చానల్ లో అయినా కనిపించిందా అని బుగ్గన ప్రశ్నించారు.

మరి ఇంతలా దాచేసి ఏపీని అప్పుల పాలు కాకుండా చూసుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. ఏపీ అంటే బాబు అమరావతి పోలవరం అని అంటున్నారు కానీ ఏపీ అంటేనే అప్పు అని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తవ్వి తీసేందుకు బంగారు గనులు ఏవీ లేవు. సంపద సృష్టి అన్నది ఒక అందమైన నినాదం.

ఏపీ ఉమ్మడిగా ఉన్నపుడు కూడా సీమాంధ్ర పూర్తిగా వ్యవసాయ రాష్ట్రం. సంపద అంతా హైదరాబాద్ నుంచే వచ్చేది అలా చూసుకుంటే ఏపీలో సేవా రంగం ఐటీ రంగం పారిశ్రామిక రంగం వేళ్ళూనుకుని భారీ వృక్షాలు కావాలి. అపుడే సంపద సృష్టి జరుగుతుంది. కానీ ఏపీ భౌగోళికంగా చూసినపుడు ఎంత మేరకు అవకాశం ఉందో అంతే మేరకు అభివృద్ధి ఆయా రంగాలలో సాగుతుంది.

అందువల్ల ఏపీలో సంపద సృష్టి అన్న మాట నినాదంగా బాగుంటుంది కానీ ఆచరణలో మాత్రం దశాబ్దాల కాలమే పట్టవచ్చు. మరి అంతవరకూ పాలకులు ఏమి చేస్తారు. ఆదాయాలు చాలకపోతే అప్పులే చేస్తారు. గతంలో వైసీపీ చేసినా ఇపుడు కూటమి చేసినా కూడా అదే. కానీ వైసీపీ చేస్తే అప్పు తప్పు. కూటమి చేస్తే అది అసలు ఎక్కడా కనబడని వార్తగా ఉండడమే గొప్ప అన్నట్లుగా ఉన్న చందమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అంటున్నారు.

Tags:    
  • Tdp 
  • Chandrababunaidu 
  • Ndaalliance 
  • Debits 
  • Media 
  • Janasena 
  • Pawankalyan 
  • Ysrcp 
  • Jaganmohanreddy 
  • Bugganarajendranathreddy 

Similar News

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

Copyright @2026

Powered by Blink CMS