• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా కంటే కర్కశంగా మరో...

కరోనా కంటే కర్కశంగా మరో వైరస్

| ఈ మార్బర్గ్ వైరస్ లో మరణాలు రేటు చాలా అధికమని అంటున్నారు. నూటికి 88 మంది ఈ వ్యాధి సోకిన వారిలో మరణిస్తారు అని చెబుతున్నారు.

By - Satya P
Update: 2025-12-09 02:30 GMT

కరోనా ప్రపంచాన్ని భయం గుప్పిట ఉంచి మొత్తానికి మొత్తం షట్టర్ డౌన్ చేసింది. కరోనా విసిరిన మృత్యు ఊయాలలో పడి అనధికారికంగా పదుల లక్షలలోనే జనాలు ఈ ప్రపంచంలో ప్రాణాలు వదిలారు. కరోనా అంటేనే వెన్ను వణుకుతోంది. సరిగ్గా ఇప్పటికి ఆరేళ్ళ క్రితం 2019 డిసెంబర్ లో ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి ఆ మీదట ప్రపంచాన్ని మొత్తంగా కమ్మేసి చిత్తుగా ఓడించేసింది. అయితే కరోనా నుంచి తట్టుకుని టీకాలతో ప్రాణాలను నిలబెట్టుకుని ప్రపంచ మానవాళి ముందుకు అడుగులు వేస్తోంది. అయితే ఈ సమయంలో మరో పెను విపత్తు పొంచి ఉంది అని అంటున్నారు. ఇది కరోనా అమ్మ కాదు అమ్మమ్మ అని కూడా అంటున్నారు. ఇంతకీ ఆ వైరస్ పేరేమిటి, దాని కధా కమామీషూ ఏమిటి అన్నది చూస్తే భయం గొలిపే విషయాలే బయటపడుతున్నాయి.

విస్తరిస్తున్న మార్బర్గ్ వైరస్ :

ప్రపంచంలో మెల్లగా మార్బర్గ్ వైరస్ విస్తరిస్తోంది అని అంటున్నారు. ఇది కరోనా కంటే యమ డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. మరో ప్రాణాంతక వైరస్ మానవాళి ముందుకు వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరిస్తోంది. ఈ వైఅస్ ఇప్పటికే దక్షిణ ఇధియోపియాలో జోరుగా వ్యాప్తి చేందుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో డిసెంబర్ 3 నాటికి 13 మంది ఉంటే అందులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ డేంజరస్ వైరస్ దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు.

మరణాల రేటు అధికం :

ఈ మార్బర్గ్ వైరస్ లో మరణాలు రేటు చాలా అధికమని అంటున్నారు. నూటికి 88 మంది ఈ వ్యాధి సోకిన వారిలో మరణిస్తారు అని చెబుతున్నారు. మార్బర్గ్ వైరస్ సోకిన రోగులలో అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, తీవ్ర అలసట వంటివి ప్రారంభ లక్షణాలుగా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ వ్యాధి కనుక తీవ్రమైతే అంతర్గత అవయవాలలో తీవ్రమైన రక్తస్రావం కూడా కలుగుతుందని అంటున్నారు. అలాగే వ్యాధి ముదిరే కొద్దీ తీవ్రమైన వికారం వాంతులు చాతీ నొప్పి, అతిసారం వంటివి కూడా సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సోకిన తొందరలోనే :

ఇక మార్బర్గ్ వైరస్ సోకిన వారిలో కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల వ్యవధిలోనే మరణాలు సంభవిస్తాయని అంటున్నారు. జంతువుల నుంచి మనుషులకు ప్రధానంగా ఈ వైరస్ సోకుతుంది. ఇక వ్యాధి సోకిన రోగుల రక్తం ద్వారా వారి లాల జలం ద్వారా, ఇతర శారీరక ద్రవాల ద్వారా వారిని నేరుగా తాకినా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పటిదకా ఈ ప్రాణాంతక వ్యాధి అయిన మార్గ్ బర్గ్ వైరస్ కి ఎటువంటి టీకా కానీ మందులు కానీ లేకపోవడమే సకల భయాలకు కారణంగా ఉంది. యాంటీ వైరస్ చికిత్స అన్నది అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని నియంత్రణతోనే దీనిని అధిగమించాల్సి ఉందని అంటున్నారు.

Tags:    
  • marburgvirus 
  • deadlyvirus 
  • globalhealth 
  • virusalert 
  • pandemicwarning 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS