విధి విచిత్రం అంటే ఇదే.. మాన మీద పడి ప్రాణం తీసింది

కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త.. అక్కడ మోడు వారిన చెట్టు అప్పటికప్పుడు కూలిపోవటం;

Update: 2024-05-22 04:37 GMT

విన్నంతనే.. అయ్యో అనిపించే విషాద ఘటనగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన గురించి తెలిస్తే.. విధి విచిత్రం అంటే ఇలానే ఉంటుందా? ప్రాణాలు పోయే టైం వస్తే.. వెతుక్కుంటూ తన దగ్గరకు తీసుకెళ్లేలా చేస్తుందన్న మాటలు గుర్తుకు వస్తాయి. కాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న భార్యకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త.. అక్కడ మోడు వారిన చెట్టు అప్పటికప్పుడు కూలిపోవటం.. భర్త మీద పడి ఘటనాస్థలంలోనే మరణిస్తే.. తీవ్ర గాయాలతో భార్య చికిత్స పొందుతున్న షాకింగ్ వైనం గురించి తెలిసినంతనే విషాదం కమ్మేస్తుందని చెప్పాలి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో చోటు చేసుకున్న ఈ అసమాన్యమైన ఉదంతంలోకి వెళితే.. శామీర్ పేటలోని తూంకుంట పట్టణానికి చెందిన సరళాదేవి బొల్లారంలోని త్రిశూల్ పార్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. కొద్దిరోజులుగా కాలి నొప్పితో బాధ పడుతున్న ఆమె.. చికిత్స కోసం భర్త రవీంద్రతో కలిసి టూవీలర్ మీద కంటోన్మెంట్ ఆసుపత్రికి మంగళవారం ఉదయం వచ్చారు.

ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే.. ఒక్కసారిగా తురాయి చెట్టు కుప్పకూలింది. ఆచెట్టు సరిగ్గా వారున్న దగ్గరే పడటం.. అది కూడా చెట్టు మోడు రవీంద్ర ఛాతీని బలంగా తాకింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన వెనకున్న సరళాదేవి మీద ఆయన పడటంతో ఆమె నేల మీద పడ్డారు. దీంతో సరళాదేవి తల.. వెన్నుపూస.. కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు వరకు చెట్టు వద్దే ఉన్న వారంతా.. అక్కడ జరిగింది చూసి భీతిల్లిపోయారు.

భర్త చనిపోయారన్న విషయాన్ని తెలియని సరళాదేవి తన భర్త ఇంకా బతికే ఉన్నారని భావిస్తూ.. ఆయన క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులు.. బంధువుల్ని అడుగుతున్న తీరు చూపురలను కలిచివేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుఉన్నారు. ఈ విషాద ఘటన అనంతరం కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఘటనాస్థలాన్ని చేరుకున్నారు. రెండు వారాల క్రితమే ఆసుపత్రి వద్దకు వచ్చి.. ఎండిపోయిన చెట్లను కొట్టించాలని ఆదేశించారు. అయితే.. ఆ పని పూర్తి చేయని సిబ్బంది కారణంగా ఒక నిండు ప్రాణం బలైన దుస్థితి.

Tags:    

Similar News