గమనించారా? 2011 మాదిరే.. 2026 పోలింగ్ వేళ.. సేమ్ లొకేషన్
రాజకీయాలకు సంబంధించి మీడియాలో కొన్ని అంశాలు పెద్దగా హైలెట్ కావు. పాసింగ్ కామెంట్స్ మాదిరి సాగిపోతాయి.;
రాజకీయాలకు సంబంధించి మీడియాలో కొన్ని అంశాలు పెద్దగా హైలెట్ కావు. పాసింగ్ కామెంట్స్ మాదిరి సాగిపోతాయి. కాస్తంత నిశితంగా చూసినప్పుడు మాత్రం ఇలాంటివి బయటకు వస్తుంటాయి. తాజాగా ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది పోలింగ్ సందర్భంగా బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ఓటమి వేదనతో.. ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపించింది. అంతేకాదు.. ఈసారి బెంగాల్ కోట బద్ధలు కావటమే కాదు.. బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని కమలనాధులు వ్యక్తం చేస్తున్నారు.
స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం.. ఈసారి బెంగాల్ లో పార్టీ విజయం సాధిస్తుందని.. తాను ఇప్పుడైతే వెళుతున్నాను కానీ.. ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ తాను ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అతిధిగా మళ్లీ వస్తానని వ్యాఖ్యానించటం తెలిసిందే. ఏ రాష్ట్ర ఎన్నికల సమయంలోనూ మోడీ నోటి నుంచి ఈ తరహ వ్యాఖ్యలు రాలేదని.. బెంగాల్ లో మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ సందర్భంలోనే బెంగాల్ సీఎం మమత మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ వేళ.. కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించదంటూ తీవ్ర ఆరోపణ చేశారు సీఎం మమత. బీజేపీ పెద్ద ఎత్తున రిగ్గింగ్ కు పాల్పడుతుందన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతుందంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో విధుల్లో ఉన్న అధికారులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని.. కేంద్ర బలగాలను ఉపయోగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు. బెంగాల్ ను ఢిల్లీ నుంచి పాలించాలని.. ఇక్కడి ప్రజలను విభజించాలని.. కల్చర్ మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా విరుచుకుపడ్డారు.
అయితే.. మమతా చేసిన వ్యాఖ్యలపై ఎక్కువమంది ఒక కోణంలో చూడటం కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాల మీద ఆమె నిరాశకు గురయ్యారని.. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందని.. అందుకే దీదీ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వస్తున్నట్లుగా కొందరు విశ్లేషించారు. దీనికి తోడు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావటం.. అందులోనూ కొన్ని ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించిన సంస్థలు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి విజయం ఖాయమన్న మాటను హైలెట్ చేయటం.. దీనికి భిన్నంగా మమత నిరాశలో ఉన్నట్లుగా ఆమె వ్యాఖ్యల్ని ప్రొజెక్టు అయ్యాయి.
అయితే.. ఇక్కడే గతాన్ని చాలామంది మిస్ అయ్యారు. ఇప్పుడు ఎలా అయితే ఎన్నికల తుదిదశలో మధ్యాహ్న వేళలో ఎలా అయితే.. బీజేపీ మీద తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారో.. ఇంచుమించు అలాంటి సీన్ 2021లో కనిపిస్తుంది. అప్పుడు కూడా పోలింగ్ తుదిదశలో ఉన్న వేళ.. ఒకే సమయంలో ఒకే నియోజకవర్గ పరిధిలోనే ఇదే తరహాలో అప్పుడు కూడా విమర్శలు చేయటం కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అప్పట్లో మమత ఏ నియోజకవర్గం పరిధిలో సంచలన వ్యాఖ్యలు చేశారో.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా ముగిసిన ఎన్నికల్లో.. అదే నియోజకవర్గం పరిధిలోనే ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
2021లో టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ సాగగా.. అప్పటి ఎన్నికల పోలింగ్ చివరిరోజున నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన మమత మాట్లాడుతూ.. నాటి కేంద్రం తీరును తప్పు పడుతూ విమర్శలు.. సంచలన ఆరోపణలు చేశారు. 2021 ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నందిగ్రామ్ నియోజకవర్గం పరిధిలోని బోయల్ అనే గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ నంబరు ఏడు వద్ద ఆమె నిప్పులు చెరిగారు. టీఎంసీ వర్సెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్లిన మమత.. ఉద్రిక్త పరిస్థితుల్లో దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉండిపోయారు.
కట్ చేస్తే.. తాజాగా జరిగిన ఉదంతాన్ని చూస్తే.. బుధవారం మధ్యాహ్నం నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ.. మమత స్వస్థలమైన భబానీ పూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ హైడ్రామా చోటు చేసుకుంది. మధ్యాహ్న వేళలో జరిగిన ఈ ఉదంతంలో సీఎం మమత నిప్పులు చెరిగారు. కేంద్రం తీరును ఉతికి ఆరేసినట్లే మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యల్ని మమత నిరాశకు ప్రతిరూపంగా కొందరు చూశారు. అయితే.. 2021లోనూ మమత తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇదే తరహాను ప్రదర్శిస్తూ.. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తీరును తప్పు పట్టారు. అప్పట్లోనూ ప్రతికూల ఫలితం రావొచ్చన్నఅంచనా వేసినోళ్లకు భిన్నంగా.. ఆమె విజయం సాధించారు. అందరి చూపు తన మీద పడేలా ఆమె మాట్లాడినట్లుగా విశ్లేషణ చేస్తున్నారు. మరి.. 2021ను 2026లో మమత రిపీట్ చేస్తారా? లేదంటే.. బెంగాల్ లో సరికొత్త హిస్టరీ షురూ కానుందా? అన్నది మరికొద్దిరోజుల్లో తేలనుందని చెప్పాలి.