• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మల్లారెడ్డి కాంగ్రెస్‌ లో...

మల్లారెడ్డి కాంగ్రెస్‌ లో చేరికకు వారే అడ్డు!

| అంతేనా ‘నేను తుమ్మితే తుపాను వస్తది’ అని కూడా డైలాగ్‌ పేల్చారు.

By - Tupaki Desk
Update: 2024-03-05 06:02 GMT

తెలంగాణ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కంటే కూడా ‘పూలు అమ్మినా.. పాలు అమ్మినా.. కట్టెలమ్మినా.. ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టినా’ అనే డైలాగ్‌ ద్వారానే మల్లారెడ్డి పాపులర్‌ అయ్యారు. అంతేనా ‘నేను తుమ్మితే తుపాను వస్తది’ అని కూడా డైలాగ్‌ పేల్చారు.

అయితే బళ్లు ఓడలయినట్టు, ఓడలు బళ్లు అయినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చిత్తవ్వడంతో మల్లారెడ్డికి కూడా కష్టకాలం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాలో తన హవాను సాగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు భూకబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అప్పట్లో మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి వందల ఎకరాలను భూములను ఆక్రమించారని విమర్శించారు. ఈ విమర్శలపై మల్లారెడ్డి సైతం రేవంత్‌ పై ఘాటుగా స్పందించారు.

తాజాగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజీకి రోడ్డు వేసుకున్నారన్న ఆరోపణలపై మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ ముందే గ్రహించిన మల్లారెడ్డి కాంగ్రెస్‌ గెలవగానే ఆ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ మా వాడేనని.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు.

కాగా ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని టాక్‌ నడుస్తోంది. ఆయనతోపాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితోపాటు ఇటీవల ఎన్నికల్లో మల్లారెడ్డిపై ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత నక్కా ప్రభాకర్‌ గౌడ్‌.. మల్లారెడ్డి కాంగ్రెస్‌ లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా మల్లారెడ్డి విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. స్వయంగా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు తానే మల్లారెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి.. ఇప్పుడు తానే పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నా రేవంత్‌ పెద్ద ఆసక్తిగా లేరని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాత్రం తన ఆశలు వదులుకోకుండా కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న ఒక వ్యక్తి ద్వారా పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. కర్ణాటక నేత ద్వారా తెలంగాణ పీసీసీ నేతలపై ఒత్తిడి తెచ్చి పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags:    
  • Congressparty 
  • Brsparty 
  • Bjp 
  • Mallareddy 
  • Revanthreddy 
  • MarriRajasekharaReddy 
  • SudhirReddy 
  • ThotakuraVajreshyadav 
  • NakkaPrabhakargoud 

Similar News

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం

2026-11-15 03:37 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

వారికి జగన్ దర్శన భాగ్యం లేదా ?

2026-11-15 02:30 GMT

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

2026-11-14 17:46 GMT

నాగార్జునకు భారీ లబ్ది...ఈటల సంచలన వ్యాఖ్యలు!

2026-11-14 16:43 GMT

Copyright @2026

Powered by Blink CMS