• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  వారికి జగన్ దర్శన భాగ్యం...

వారికి జగన్ దర్శన భాగ్యం లేదా ?

| 2014–19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు క్యాడర్‌కు దగ్గరగా ఉన్న వైఎస్ జగన్, సీఎం అయ్యాక కార్యకర్తలకు దూరమయ్యారన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. 2024 ఓటమికి కూడా ఇది ఒక కారణమని విశ్లేషిస్తున్నారు. తాజాగా స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా పోరాడటంతో వారిని జగన్ నేరుగా కలవాలని, సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-15 02:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని బాగా దగ్గరగా కలిసిన సందర్భాలు అయితే 2014 నుంచి 2019 మధ్యలోనే అని పార్టీలో క్యాడర్ గుర్తు చేసుకుంటూంటారు. అప్పట్లో జగన్ చేయని పోరాటాలు లేవు, పర్యటించని జిల్లాలు లేవు, ఆయన నిర్వహించని కార్యక్రమాలు లేవు. జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి నేరుగా ఏపీకి వచ్చి అనేక కార్యక్రమాలలో పాలు పంచుకునేవారు. క్యాడర్ తో కలిసి ఆయన ఉద్యమించేవారు. ఆ సమయంలో జగన్ డైనమిక్ లీడర్ గా అపోజిషన్ లీడర్ గా ఉన్నా క్యాడర్ కి మాత్రం బాగా దగ్గరగా ఉండేవారు అని చెబుతారు. ఇక పాదయాత్ర 2017 నుంచి 2019 జనవరి దాకా జగన్ చేసినప్పుడు మరింతగా క్యాడర్ తో మమేకం అయ్యారు. దానికి తగినట్లుగానే 2019 ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయని చెబుతారు.

దూరంగానే మరి :

అయితే 2019లో జగన్ సీఎం అయ్యాక మాత్రం దూరం పెరిగింది అన్నది క్యాడర్ లో గూడు కట్టుకున్న బలమైన భావనగా ఉంది. పరదాల మాటున సభలు అధికారిక హోదాలో జరిగేవి. జగన్ ముఖ్యమంత్రిగా వచ్చి వెళ్ళిపోయేవారు. ఇక తాడేపల్లి లో ఆయనను కలిసేందుకు కూడా సామాన్య కార్యకర్తలకు చాన్స్ లేకుండా పోయింది అన్నది కూడా ఉంది. అన్నీ కలిసి క్యాడర్ లో ఒక విధమైన నైరాశ్య భావం కలిగి అది 2024 ఎన్నికల్లో వైసీపీని నిలువునా దెబ్బ తీసింది. క్యాడర్ ఉదాశీనత వల్లనే వైసీపీకి ఘోర పరాజయం దక్కింది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. దానిని వైసీపీ అధినాయకత్వం కూడా అంగీకరించింది కాబట్టే జగన్ తరచూ 2.0 అంటూంటారు. అందులో క్యాడర్ కే తమ తొలి ప్రయారిటీ అని కూడా గట్టిగా చెబుతూ వస్తున్నారు.

ప్రాణాలకు తెగించి :

మరి ఇంతలా క్యాడర్ విషయంలో అండగా ఉంటామని వైసీపీ అధినాయకత్వం చెప్పడం వరకూ బాగానే ఉన్నా ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతోంది అన్నదే వైసీపీలో అంతా చర్చిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే వైసీపీకి ఈ మాత్రం ఫలితాలు వచ్చాయీ అంటే క్యాడర్ తెగించి పోరాడి నందు వల్లనే అని గుర్తు చేస్తున్నారు. ఏకంగా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వైసీపీ కార్యకర్తలు జెండా పట్టుకుని కూటమికి ఎదురెళ్ళారు. చాలా చోట్ల అయితే నాయకులు కాస్తా తగ్గినా కూడా కార్యకర్తలు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదని అంటున్నారు. ఈ కారణంగానే అనేక జిల్లాలలో వైసీపీకి ఓటు శాతం కూడా బాగానే వచ్చింది. కూటమితో పోలిస్తే తేడా ఎక్కువగా ఉన్నా టీడీపీతో చూస్తే సమీపంలోకి వచ్చింది అని అంటున్నారు.

వారికి దారేదీ :

వైసీపీ స్థానిక ఎన్నికల్లో ఒక విధంగా పోరాడింది. ఎంతలా అంటే వైసీపీ అధినాయకత్వమే ఆశ్చర్యపోయేటంతలా అని అంటారు. దానికి కారణం క్యాడర్ లో నిబద్ధత అంకిత భావమే అని గుర్తు చేస్తున్నారు. అలాంటి క్యాడర్ ని వైసీపీ హైకమాండ్ దగ్గరకు తీయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. వారికి నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చి మరీ వారితో జగన్ సమావేశం అయితేనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పూర్తిగా అర్థం అవుతాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఫలితాల మీద వైసీపీలో సమీక్ష నిజాయతీగా జరగాలంటే మాత్రం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తేనే అసలైన నివేదికలు వస్తాయని అంటున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం క్యాడర్ కి దూరంగానే ఉంటోంది అన్నది అయితే ఉంది. మరి తొందరలో అయినా వారితో మీటింగ్స్ పెట్టాలన్నది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న డిమాండ్ గా ఉంది.

Tags:    
  • ysjagan 
  • ysrcp 
  • ysrcpcadre 
  • ysrcpworkers 
  • jagan 

Similar News

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం

2026-11-15 03:37 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

2026-11-14 17:46 GMT

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

2026-11-14 10:30 GMT

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

2026-11-14 09:30 GMT

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

2026-11-14 08:30 GMT

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

2026-11-14 07:49 GMT

జెడ్పీ పీఠం కోసం జనసేన...వైరిచర్ల వారసుడికి అందేనా ?

2026-11-14 03:29 GMT

బొత్స ఓటమి సెంటిమెంట్... అనూష హిట్ అవుతుందా ?

2026-11-14 03:25 GMT

Copyright @2026

Powered by Blink CMS