• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జెడ్పీ పీఠం కోసం...

జెడ్పీ పీఠం కోసం జనసేన...వైరిచర్ల వారసుడికి అందేనా ?

| ఉత్తరాంధ్రలో ఆరు జడ్పీ పీఠాలకు గాను అల్లూరి జిల్లా పరిషత్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన ఐదింటిలో జనసేనకు మరో రెండు కేటాయించాల్సి ఉండటంతో పార్వతీపురం మన్యం, అనకాపల్లి పీఠాలపై చర్చ జరుగుతోంది. మన్యం పీఠాన్ని జనసేన కోరుతుండగా, టీడీపీ నుంచి గెలిచిన వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-14 03:29 GMT

ఉత్తరాంధ్రాలో ఉన్న ఆరు జడ్పీ పీఠాలలో ఒకటి వైసీపీ గెలుచుకుంది. అల్లూరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని పూర్తి మెజారిటీతో వైసీపీ సాధించుకుంది. దాంతో జనసేనకు ఆ జిల్లా పీఠం కేటాయిస్తారు అన్న ప్రచారం నేపధ్యంలో అక్కడికి ఆదిలోనే కధ వేరు అయింది. దాంతో మిగిలిన అయిదు జెడ్పీ పీఠాలలో రెండింటిని జనసేనకు ఎక్కడ ఎలా అడ్జస్ట్ చేయాలన్నది కూటమిలో చర్చగా ఉంది. విజయనగరం విశాఖ రెండు జెడ్పీ పీఠాలూ టీడీపీకే అని స్పష్టం అయింది. దాంతో మరో మూడు ఉన్నాయి. అందులో శ్రీకాకుళం జెడ్పీ పీఠం జనసేనకు పొత్తులో కేటాయించారు. ఆ రెండవది ఎక్కడ అన్నదే చర్చగా ఉంది.

మన్యం మీదనే మనసు :

ఇక అనకాపల్లి జెడ్పీ లేదా పార్వతీపురం మన్యం జిల్లా జెడ్పీ పీఠాలలో ఒకటి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. ఇందులో మన్యం పీఠం మీద జనసేన మనసు ఉందని అంటున్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాలలో పవన్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పాలకొండ ఎస్టీ అసెంబ్లీ సీటుని జనసేన 2024 ఎన్నికల్లో గెలుచుకుంది. ఉత్తరాంధ్రాలో ఉన్న మరిన్ని ఎస్టీ ఎమ్మెల్యే సీట్లలో బలం పెంచుకుంటే 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. దీంతో మన్యం జెడ్పీ పీఠాన్ని తమకు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది అని అంటున్నారు.

ఆ కుటుంబానికి హామీ :

అయితే పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం కురుపాం జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు అధిష్టానం హామీ ఇచ్చిందని కూడా అంటున్నారు. కురుపాం నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అలాంటి ప్రాంతంలో టీడీపీని బలోపేతం చేసినందుకు వైరిచర్ల కుటుంబ సభ్యులకు జిల్లా పరిషత్తు చైర్మన్ పదవి ఇస్తామని గతంలోనే టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చింది అని అంటున్నారు. ఇక వీరేశ్‌ చంద్ర దేవ్ ది ప్రముఖ రాజకీయ కుటుంబం. ఆయన సొంత పెదనాన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎన్నో సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఇక ఆయన తండ్రి ప్రదీప్ చంద్రదేవ్ ఎంపీగా చేశారు. ఆయనకు విజయనగరం పూసపాటి రాజులతో బంధుత్వం ఉంది. ఇలా చూస్తే అన్ని విధాలుగా వీరేశ్‌ చంద్రదేవ్‌ కి అండదండలు ఉన్నాయి.

అనకాపల్లి ఇవ్వాల్సిందే :

ఒకవేళ పార్వతీపురం మన్యం జిల్లా పీఠం ఇవ్వకపోతే అనకాపల్లి జనసేనకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ కూడా తమ్ముళ్ళు తమకే జెడ్పీ పీఠం దక్కాలని పట్టుబడుతున్నారు. దాంతో జనసేనకు ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ఒక్కటి ఇచ్చి ఊరుకుంటారా లేక రెండవది ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా మొత్తం 28 జడ్పీ పీఠాలలో 5 జనసేనకు కేటాయిస్తున్నారని తెలుస్తోంది. అందులో పల్నాడు, శ్రీ సత్యసాయి, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ కూడా శ్రీ సత్యసాయిలో జనసేనకు కాదని టీడీపీ పట్టుబడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • janasena 
  • tdp 
  • pawankalyan 
  • northandhra 
  • andhrapradeshpolitics 

Similar News

బొత్స ఓటమి సెంటిమెంట్... అనూష హిట్ అవుతుందా ?

2026-11-14 03:25 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

బీజేపీ డీలిమిటేషన్ బిల్లు...జగన్ సంచలన నిర్ణయమేనా ?

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

Copyright @2026

Powered by Blink CMS