• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  బొత్స ఓటమి సెంటిమెంట్......

బొత్స ఓటమి సెంటిమెంట్... అనూష హిట్ అవుతుందా ?

| విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో కుమార్తె బొత్స అనూష ఓటమిపై బొత్స సత్యనారాయణ తొలిసారి స్పందించారు. 1996లో తాను కూడా తొలి ఎన్నికల్లో ఓడిపోయానని, 1999లో గెలిచానని గుర్తుచేశారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకుని తప్పులు సరిదిద్దుకోవాలని అనూషకు సూచించారు. అందరినీ కలుపుకుని కష్టపడితేనే విజయం సాధ్యమని వైసీపీ నేతలకు చెప్పారు.

By - Satya P
Update: 2026-11-14 03:25 GMT

రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఓటమి గెలుపు ఉంటాయి. ఎందరో పోటీ పడితే ఒక్కరు మాత్రమే గెలుస్తారు. గెలిచిన వారి గురించి పక్కన పెడితే ఓటమి చెందిన వారి మీద మాత్రం విమర్శల వర్షం కురుస్తుంది. అసలు ఎందుకు ఓటమి పాలు అయ్యారో వారికి అర్థం కాదు, మరింతగా వారు కృంగిపోతారు. అయితే ఓటమి నుంచే విజయానికి తొలి మెట్టు అన్నది అన్ని రంగాలలో ఉన్నదే. రాజకీయాల్లోనూ అదే అమలు అవుతోంది. ఇక ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం బొండపల్లి నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసిన బొత్స అనూష అయిదు వేల భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఒక విధంగా ఆ జిల్లాలో అదే అతి పెద్ద సంచలనం అయింది.

నేనూ ఓడిపోయా

అయితే కుమార్తె ఓటమి రాజకీయంగా దిగ్గజ నేత అయిన బొత్స సత్యనారాయణను కూడా షాక్ తినిపించింది అని ప్రచారం సాగింది. బొత్స తన కుమార్తె ఓటమి గురించి ఎక్కడా మీడియా ముందు కూడా మాట్లాడలేదు, కానీ తాజాగా భీమిలీ నియోజకవర్గం వైసీపీ నేతల సమావేశంలో ఆయన తొలిసారి ఈ అంశం మీద స్పందించారు. కుమార్తె ఓటమి గురించి మాట్లాడుతూ పాతిక ముప్పయ్యేళ్ళ నాటి తన అనుభవాలను కూడా ఆయన నెమరువేసుకున్నారు. తనకు తొలి ఎన్నికల్లో ఓటమి లభించింది అని బొత్స చెప్పుకొచ్చారు. దానికి తాను నీరసపడి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడిని కాను అని అన్నారు.

అక్కడ నుంచే అలా :

ఇక వెనక్కి వెళ్ళి చూస్తే 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ బొబ్బిలి నుంచి ఎంపీగా తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన కొండపల్లి పైడితల్లి నాయుడు విజయం పొందారు. అయితే పట్టుబట్టి పనిచేసి 1999లో జరిగిన ఎన్నికల్లో తాను బొబ్బిలి నుంచి గెలిచాను అని బొత్స చెప్పారు. అలా తన రాజకీయ జీవితంలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే తొలి ఓటమి కారణం అన్నారు. ఓడినపుడు ఎందుకు ఓడామని చర్చ వస్తుందని దానిని మననం చేసుకుని తప్పులు దిద్దుకుని ముందుకు సాగాలని పార్టీ సమావేశంలో మాట్లాడుతూనే కుమార్తె అనూషకు కూడా ఆయన హిత బోధ చేశారు.

అందరినీ కలుపుకుని పోవాలి :

గెలుపు ఊరకే రాదు అని బొత్స అన్నారు. దాని కోసం ఎంతో కష్టపడాలని అన్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలీ అంటే పంచాయతీలో ఉన్న వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా కృషి చేస్తేనే సాధ్యం అవుతుందని అందువల్ల అందరితో మమేకం కావాలని సూచించారు. ఇంత చేసినా అదృష్టం కూడా కలిసి రావాలని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు దగ్గర దారులు ఉండవని కష్టపడడమే ఏకైక దారి అని బొత్స అన్నారు.

సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా :

ఇక బొత్స తొలిసారి ఓటమి చెంది మళ్ళీ గెలిచి ఏకంగా ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఆ తరువాత ఆయన ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసి మంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. పీసీసీ చీఫ్ గా కూడా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. మరి ఆయన రాజకీయ వారసురాలికి కూడా ఓటమి నుంచి గెలుపు పిలుపు వినిపిస్తుందా అన్నది అంతా చర్చిస్తున్నారు. భీమిలీలో అనూష వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా 2029 లో పోటీ పడనున్నారు. అది తెలుగుదేశానికి బలమైన రాజకీయ స్థావరం. అందువల్ల ఇప్పటి నుంచే కష్టించి పనిచేయాలని బొత్స కుమార్తెకి సూచిస్తూనే పార్టీ నేతలకు కూడా ఇదే విషయం చెప్పారు.

Tags:    
  • botsasatyanarayana 
  • botsaanusha 
  • ysrcp 
  • andhrapradeshpolitics 
  • bheemili 

Similar News

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS