• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూటమి వైసీపీల మధ్య...

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

| ఏపీలో నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా 13 వేలకు పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాల్లోనూ విజయం సాధించాలని చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రతి సర్పంచ్, వార్డు స్థానంలోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సజ్జల ద్వారా జగన్ సూచించారు. గ్రామీణ పోరుకు ఇరు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-14 17:46 GMT

ఏపీలో అర్బన్ బాడీస్ కి అలాగే పరిషత్తులకు ఎన్నికలు పూర్తి అయిపోయాయి. టీడీపీ కూటమి మంచి ఆధిక్యాన్ని కనబరచింది. వైసీపీ అయితే నైతిక విజయం తమదని చెప్పుకుంది. ఈ నేపధ్యంలో ఏపీ వ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మూడు విడతలలో జరగబోతున్నాయి. ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయ పార్టీల ప్రమేయం ఏ మాత్రం లేని ఎన్నికలు ఇవి. అయితే పేరుకు ఇలా అనుకోవడం తప్ప పార్టీల మద్దతుతో నాయకులు పోటీకి దిగుతారు. దాంతో కనిపించీ కనిపించని రాజకీయ సమరం పల్లెలలో సాగుతుంది.

గ్రామాల్లోనూ ప్రభంజనం :

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నాయకులతో తాజాగా నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అయితే పల్లెలలోనూ విజయ ఢంకా మోగించాలని గట్టిగా కోరారు. అంతే కాదు మునిసిపల్,పరిషత్తు ఎన్నికల్లో సాగించిన ప్రభంజనం కొనసాగించాలని సూచించారు. గతం కంటే పాతిక శాతం ఓటు బ్యాంక్ స్థానిక ఎన్నికల్లో కూటమికి వచ్చిందని బాబు చెప్పారు. అందువల్ల పల్లెలలో కూడా అదే జోరు సాగాలని ఆయన అన్నారు. ఈవీఎంలు అయినా బ్యాలెట్ పేపర్లు అయినా, చివరకు పోస్టల్ బ్యాలెట్ లోనైనా ప్రజలు కూటమికే సంపూర్ణ మద్దతు పలికారని బాబు గుర్తు చేశారు.

ఏకగ్రీవాలు వద్దు :

ఇంకో వైపు వైసీపీ కూడా ఏకగ్రీవాలు వద్దు అని తమ పార్టీ నేతలకు స్పష్టం చేసింది. పల్లెలలో బలంగా ఉన్న నాయకులను పోటీకి నిలపాలని వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి కోరారు. తప్పనిసరిగా ప్రతి స్థానానికి పోటీ చేసి తీరాల్సిందే అని అన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానానికి పార్టీ మద్దతుదారులు తప్పనిసరిగా పోటీ చేయాలని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సజ్జల తెలిపారు. అదే విధంగా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్తోమత కంటే స్థానిక ప్రజాబలం రిజర్వేషన్ నిబంధనలు నాయకత్వ లక్షణాలు, ప్రచార సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

క్షేత్రస్థాయి బలోపేతం కోసం :

పల్లెలల్లో జరిగే ఎన్నికలు పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తాయని చెప్పారు. అందువల్ల భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావడానికి ఇవి ఎంతో కీలకమని సజ్జల పేర్కొన్నారు. అదే విధంగా ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు, పోలీసులు, అధికారులను ఉపయోగించి నామినేషన్లు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఆటంకం కలిగించారని ఆయన ఆరోపించారు. అయినా సరే పార్టీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో బలమైన పోటీ ఇవ్వాలని సజ్జల పిలుపునిచ్చారు.

సమరం తప్పదా :

పంచాయతీలలో సర్పంచ్ పదవి అంటే ఎంతో కీలకమైనది. దాంతో ఈ పదవుల కోసం పార్టీలు మద్దతు ఇచ్చిన వారిని గెలిపించుకోవాలని చూస్తాయి. పల్లెల నుంచే నాయకత్వం వస్తుందని నమ్ముతాయి. రేపటి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ ఎన్నికలే కీలకంగా భావిస్తాయి. ఈ నేపధ్యంలో పల్లెలలో జరిగే పోరు మరోసారి ఆసక్తిని పెంచనుంది. ఢీ అంటే ఢీ అనే వాతావరణం కనిపించనుంది. మరి వేల పంచాయతీలలో సాగే ఈ రాజకీయ కురుక్షేత్రం కడు రసవత్తరం అని అంటున్నారు.

Tags:    
  • appanchayatelections 
  • tdp 
  • ysrcp 
  • chandrababunaidu 
  • ysjagan 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS