• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  మంత్రులకు డేంజర్ బెల్స్ ?

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 2తో ముగియనున్న నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై చర్చ మొదలైంది. డిసెంబర్ 12 నాటికి కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. మంత్రుల పనితీరు, ఎన్నికల్లో వారి ప్రదర్శన ఆధారంగా మార్పులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. రాయలసీమ నుంచి ఇద్దరు, ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని, మొత్తంగా నలుగురి నుంచి ఆరుగురికి పైగా మార్పులు ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-15 03:43 GMT

స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఏపీలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అన్న ప్రచారం సాగుతూ వస్తున్న సంగతి విధితమే. ఇపుడు చూస్తే స్థానిక సమరం డిసెంబర్ 2తో పూర్తి అవుతుంది. అప్పటికి పంచాయతీల ఎన్నికలు సైతం జరిగిపోతాయి. ఇక సొసైటీలు, సహకార సంఘాల ఎన్నికలు కూడా జనవరి లోగా పూర్తి చేస్తామని కూటమి పెద్దలు చెబుతున్నారు. ఆ మీదట పూర్తిగా పాలన మీదనే దృష్టి పెడతామని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పోతే డిసెంబర్ 12 నాటికి కూటమి పాలనకు ఏపీలో ముప్పై నెలలు పూర్తి అవుతాయి. అంటే అచ్చంగా రెండున్నరేళ్ళు అన్న మాట.

బడ్జెట్ ముందేనా :

ఇక 2027 బడ్జెట్ సమావేశాలు చూస్తే మార్చి నెలలో మొదలవుతాయి. దాంతో మంత్రి వర్గ విస్తరణ బడ్జెట్ ముందే తరువాతా అన్న చర్చ కూడా సాగుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కూడ త్వరలో జరగనుంది అని అంటున్నారు. దాంతో ఆ సమీకరణలు రాజకీయ ప్రాధాన్యతలు ప్రాంతీయ సమతూకాలు అన్నీ బేరీజు వేసుకుని పక్కాగా ఎన్నికల కేబినెట్ ని ఏపీలో కూటమి ప్రభుత్వం మార్పులతో కూర్పులతో రెడీ చేసుకుంటుంది అన్న ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

మంత్రుల పని తీరు :

ఇక చూస్తే మంత్రుల పనితీరు మీద ఇప్పటికే కూటమి పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పక్కా సమాచారం ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే జిల్లాలలో మంత్రులుగా ఉన్న వారు ఏ మేరకు స్థానిక ఎన్నికల్లో తమదైన రాజకీయ ప్రదర్శన చేశారు అన్నది కూడా విశ్లేషిస్తున్నారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేనతో కలుపుకుని 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో టీడీపీకి చెందిన వారు ఇరవై మంది ఉంటే అందులో కొత్త వారూ తొలిసారి గెలిచి మంత్రి అయిన వారూ ఉన్నారు. అలాగే సీనియర్లు కూడా ఉన్నారు. దీంతో సమగ్రమైన తీరులోనే మంత్రి వర్గ విస్తరణ జరపవచ్చు అని అంటున్నారు.

పలువురి విషయంలో :

ఇక ఏపీ మంత్రివర్గంలో పలువురు మంత్రుల తీరు మీద కూడా చర్చ సాగుతోంది. రాయలసీమలో వైసీపీ ఇంకా బలంగా ఉందని కొన్ని ఫలితాలలో వెల్లడి అయింది. అలాగే ఏకంగా కడప జిల్లాలో వైసీపీని కట్టడి చేశామని కూటమి భావిస్తోంది. దాంతో కడపకు ప్రాధాన్యత ఈసారి ఇస్తారు అని అంటున్నారు. అలాగే సీమ నుంచి ఇద్దరు మంత్రులను తప్పిస్తారు అని ఊహాగానాలు ఉన్నాయి.

ఉత్తరాంధ్రాలో చూస్తే :

ఇక ఉత్తరాంధ్రాలో చూస్తే నలుగురు మంత్రులు ఉన్నారు. అందులో ఇద్దరి విషయంలో అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటున్నారు. ఈ మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగ్గా వ్యవహరించలేదని అంటున్నారు. అంతే కాదు వారి సొంత ప్రాంతాలలో కూడా ఓటమి ఎదురైందని అంటున్నారు. అలాగే పొత్తుల విషయంలో సర్దుబాటులో కూడా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు ఉన్నాయని అంటున్నారు. దాంతో విస్తరణ అంటూ జరిగితే వీరి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇవ్వవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గరిష్టంగా అరడజన్ కి పైగా కనిష్టంగా నలుగురు దాకా మంత్రులను మార్చి కొత్త వారిని తీసుకుంటారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.

Tags:    
  • apcabinetexpansion 
  • andhrapradesh 
  • chandrababu 
  • tdp 
  • janasena 
  • bjp 

Similar News

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం

2026-11-15 03:37 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

వారికి జగన్ దర్శన భాగ్యం లేదా ?

2026-11-15 02:30 GMT

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

2026-11-14 17:46 GMT

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

2026-11-14 10:30 GMT

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

2026-11-14 09:30 GMT

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

2026-11-14 08:30 GMT

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

2026-11-14 07:49 GMT

జెడ్పీ పీఠం కోసం జనసేన...వైరిచర్ల వారసుడికి అందేనా ?

2026-11-14 03:29 GMT

బొత్స ఓటమి సెంటిమెంట్... అనూష హిట్ అవుతుందా ?

2026-11-14 03:25 GMT

Copyright @2026

Powered by Blink CMS