భూవివాదంలో మల్లారెడ్డి అరెస్ట్... ఇరు పక్షాల వెర్షన్స్ ఇవే!

వివరాళ్లోకి వెళ్తే... సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే... అందులోని 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది పేర్కొంటున్నారు.

Update: 2024-05-18 09:17 GMT

ప్రధానంగా బీఆరెస్స్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఫుల్ సందడిగా కనిపించిన నేతల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఒకరనేది తెలిసిన విషయమే. ఆ సంగతి అలా ఉంటే ఓ భూ వివాదం విషయంలో తాజాగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును.. ఓ భూవివాదం కేసులో మాజీ మంత్రి, బీఆరెస్స్ నేత మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో... మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా... కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లా రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో.. ఆ స్థలం చుట్టూ వేసిన భారికెడ్లను.. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగప్రవేశం చేసి బారికేడ్లను తొలగిస్తున్న వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే... అందులోని 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సర్వే నెం.82 లోని స్థలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి.. అవతలి వైపు వర్గం 15మంది మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

Read more!

ఈ సమయంలో... ఆ 15 మందిలో ఒక్కొక్కరమూ సుమారు 400 గజాల చొప్పున గతంలో కొనుగోలు చేశామని, ఈ విషయంలో కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆ 15 మంది చెబుతున్నారు. దీంతో... స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అయితే, మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15మంది సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మల్లారెడ్డి వెర్షన్ ఇదే..!:

ఈ ఘటనపై మాట్లాడిన మల్లారెడ్డి... 14 ఏళ్ల క్రితం తన అల్లుడు, తన కొడుకులు కలిసి ఈ ప్రాపర్టీని ఓ మార్వాడి సేటు దగ్గర నుంచి కొనుగోలు చేశారని చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేదని.. ఈ సమయంలో కరీంనగర్ కు చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ల్యాండ్ తమదని అంటున్నారని.. ఈ సర్వే నెంబర్లో మొత్తం 17 ఎకరాలు ఉండగా.. అందులో తాము రెండు ఎకరాలకుపైగా కొనుగోలు చేశామని అంటున్నారు.

ప్రత్యర్థివర్గం వాదన ఇది..!:

ఈ ల్యాండ్ వివాదంలో ప్రత్యర్థి వర్గంకు చెందిన వారు మాట్లాడుతూ... ఈ సర్వే నెంబర్లు ఉన్న ల్యాండ్ మొత్తం తనదేనని మల్లారెడ్డి అంటున్నాడని చెబుతున్నారు. వాస్తవానికి... 82/1/88 సర్వే నెంబర్ తమదని, 82/అ నెంబర్ మల్లారెడ్డిదని.. అందులో ఎకరం 29 కుంటలు మల్లారెడ్డికి ఉందని చెబుతున్నారు. సర్వే చేస్తే ఎవరు ల్యాండ్ వాళ్లకి వస్తుంది కానీ.. మల్లారెడ్డి మాత్రం ఈ సర్వే నెంబర్లో ఉన్న మొత్తం తనదే అంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News