• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిప్పురవ్వే.....

నిప్పురవ్వే.. కార్చిచ్చుగా మారి.. లాస్ ఏంజెలెస్ రగిలిపోతోంది..

| లాస్ ఏంజెలెస్ లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-06-09 09:45 GMT

అందాల హాలీవుడ్.. అంతకుమించిన అందాల నగరం.. నిరసనలతో రగులుతోంది.. ఆందోళనలతో అట్టుడుకుతోంది.. నిప్పు రవ్వ కార్చిచ్చుగా మారింది.. ఇదంతా అమెరికా హాలీవుడ్ కేంద్రమైన లాస్ ఏంజెలెస్ పరిస్థితి. ఎప్పుడూ వేసవి కాలంలో అడవుల్లోని కార్చిచ్చుల కారణంగా వార్తల్లో నిలిచే లాస్ ఏంజెలెస్.. ఈసారి వలసదారుల ఆందోళనలతో అగ్ని గుండంగా మారింది. దాడులు కూడా జరుగుతుండడంతో రణరంగాన్ని తలపిస్తోంది. లాస్ ఏంజెలెస్ నగరం డౌన్ టౌన్ (ప్రధాన ప్రాంతం) లో ఇప్పటికే ప్రజలు గుమిగూడడంపై నిషేధం విధించారు.

పరిస్థితి చేయిదాటుతోందా..?

డౌన్ టౌన్ లోని ప్రధాన హైవేను ఆందోళనకారులు ఆధీనంలోకి తీసుకోవడం.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టడం.. చూస్తుంటే లాస్ ఏంజెలెస్ లో పరిస్థితి అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. జాతీయ రహదారిని అదుపులోకి తీసుకోవడంలో 2 వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. పోలీసులపై దొరికిన వస్తువులను విసిరేశారు. వారి వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ రహదారి చాలా కీలకం అయినది.. అది ఎంతగా అంటే.. పసిఫిక్ మహా సముద్రం పక్కనుంచి 4 వేల కిలో మీటర్లు (1,500 వైళ్లు) ప్రయాణిస్తుంది.

లాస్ ఏంజెలెస్ లో కొన్ని రోజులుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) విభాగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి. దీంతో నేషనల్ గార్డ్స్ ను ట్రంప్ర్ ప్రభుత్వం రంగంలోకి దిపింది. మాస్కులు ధరించి ఉన్నవారిని అరెస్టు చేయమంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ఇటీవల ట్రంప్ తో విభేదిస్తున్న అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమర్థించగా.. లాస్ ఏంజెలెస్ గవర్నర్ కరెన్ బాస్ తీవ్రంగా వ్యతిరేకించారు. శాంతియుత ఆందోళనలు కొనసాగేలా చూడాలని, ట్రంప్ ప్రభుత్వమే పరిస్థితులను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. నేషనల్ గార్డ్స్ ను దింపి ప్రజలను ఆందోళనకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు. లాస్ ఏంజెలెస్ అనే గొప్ప నగరాన్ని అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించారు అనేది ట్రంప్ వాదన. దానికి వ్యతిరేకంగా ఆయన తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

Tags:    
  • LosAngelesProtests 
  • ImmigrationCrisis 
  • ICEProtests 
  • TrumpPolicies 
  • NationalGuard 
  • ElonMusk 
  • KarenBass 
  • USPolitics 
  • CivilUnrest 
  • LACrisis 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS