లోకేష్ ని ముద్దు చేస్తున్న మోడీ !
కెంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇంధనం ఏపీ నుంచి వస్తోంది. ఏపీలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్నారు;
కెంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇంధనం ఏపీ నుంచి వస్తోంది. ఏపీలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్నారు. మూడోసారి ముచ్చటగా ప్రధాని పీఠాన్ని మోడీ అధిరోహించారు అంటే అది టీడీపీ చలవే అని వేరేగా చెప్పాల్సింది లేదు.
దీంతో గతానికి భిన్నంగా మోడీ చంద్రబాబు పట్ల అప్యాయతను కనబరుస్తున్నారు. చంద్రబాబుకు సైతం ఢిల్లీలో విపరీతమైన పలుకుబడి పెరిగింది. ఇపుడు బాబు ఏపీ మీద ఫోకస్ పెట్టి ఉంచారు. రానున్న కాలంలో ఏపీని అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు. అంతే కాదు తాన ముఖ్యమంత్రిత్వంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేయాలని ఆరాటపడుతున్నారు.
ఇక తన వారసుడిగా నారా లోకేష్ ని నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడే బాబుకు ఉన్న అపారమైన రాజకీయ అనుభవం ఏమిటో తెలుస్తోంది. ఇక ఏపీకి గతంలో వచ్చిన ప్రతీసారీ మోడీ చంద్రబాబు పవన్ ల పేరు మాత్రమే చెబుతూ ఉండేవారు. ఇటీవల కాలంలో ఆ ధోరణి మారింది. ఆయన లోకేష్ ని దగ్గరకు తీస్తున్నారు. ఆయన భుజం మీద చేయి వేసి మరీ చిరు నవ్వులు చిందిస్తున్నారు.
అదంతా ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన ఒక కార్యక్రంలో మొదలైంది అమరావతిలో మే 2న జరిగిన రాజధాని పునర్ నిర్మాణ పనులకు సంబంధించి మోడీ వచ్చిన వేళ మరోసారి బలపడింది. ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళి మరీ మోడీతో డిన్నర్ చేసి వచ్చారు లోకేష్. గంట సేపు మాట్లాడారు కూడా. ఆ అనుబంధం విశాఖలో జరిగిన యోగా సమావేశంలో మరింతగా ప్రస్ఫుటంగా కనీపించింది.
విశాఖకు వచ్చిన మోడీకి చంద్రబాబు పవన్ లోకేష్ స్వాగతం పలికారు. అయితే మోడీ లోకేష్ భుజం మీద చేయి వేసి నిండారా నవ్వులు చిందించారు. ఇక యోగా డే వేళ ఆయన ప్రసంగిస్తూ లోకేష్ పేరు అనేకసార్లు చెప్పడంతో లోకేష్ ప్రాధాన్యత ఏమిటి అన్నది తేటతెల్లమైంది.
లోకేష్ పార్టీలో ఎటూ నంబర్ టూ గా ఉన్నారు ఇక ప్రభుత్వంలో సైతం ఆయన నంబర్ టూ ప్లేస్ కి వచ్చేశారు అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీకి కూటమి కట్టినపుడు వేరే ఆలోచనలు ఉండేవని అంటున్నారు. అందుకే మొదట్లో పవన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించింది. కానీ ఇపుడు చూస్తే మాత్రం చంద్రబాబు వారసుడుగా వేగంగా ముందుకు వస్తున్న లోకేష్ తోనే కలిసి నడవాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఏపీలో పట్టుసాధించడమే బీజేపీకి కావాల్సింది. దానికి సాధనంగా ఏ పార్టీ ఉన్నా వారికి అభ్యంతరం లేదు. దాంతో చంద్రబాబు వారసుడిగా ఏదో నాటికి ఏపీలో సీఎం అయ్యే లక్షణాలు నిండుగా ఉన్న లోకేష్ ని కోరి చేరదీస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. లోకేష్ సైతం బీజేపీ పెద్దల అశీస్సులను అందుకునే విషయంలో విజయవంతం అయ్యారని అంటున్నారు.
లోకేష్ పట్ల లోకేష్ వాత్సల్యం రాను రానూ అధికం అవుతోంది. దాంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో వారసత్వాన్ని బీజేపీ ఫిలాసఫీ అంగీకరించదు. కుటుంబ పార్టీలు అని బీఆర్ఎస్ ని ఇతర పార్టీలని నిందిస్తుంది. అయితే తమతో పొత్తు పెట్టుకున్న పార్టీల విషయంలో మాత్రం సడలింపు ఇస్తుంది. అందుకే రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. మాధవరావు సిందియా కుమారుడు జ్యోతీరాదిత్యకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
అంటే తమకు అనుకూలంగా ఉన్న పార్టీల విషయంలో వారసులకు పచ్చ జెండా ఊపడానికి బీజేపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. దాంతో ఏపీలో లోకేష్ పట్టాభిషేకానికి బీజేపీ నుంచి ఏ రకమైన అభ్యంతరాలు ఉండబోవని అంటున్నారు. పైగా చంద్రబాబు కంటే యువ నేత లోకేష్ తో చెలిమి తమకు అన్ని విధాలుగా రాజకీయంగా కలసి వస్తుందన్న లెక్కలేవో బీజేపీ పెద్దలకు ఉండి ఉంటాయని అంటున్నారు. ఏది ఏమైనా అన్ని రకాలైన అవరోధాలు ఇబ్బందులు లోకేష్ కి తొలగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఆయన ఇపుడు అత్యంత కీలక నేతగా ఉన్నారు అని అంతా అంటున్నారు.