• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దేశంలోనే అత్యంత ధనిక...

దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి.. తెలంగాణకే గర్వకారణం

| దేశంలోకెళ్ల మన రంగారెడ్డినే తోపు అంటే నమ్మగలరా? నిజంగా ఇది నిజం.. మన రంగారెడ్డి జిల్లాను మించిన రిచెస్ట్ జిల్లా దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదు.

By - A.N.Kumar
Update: 2025-12-17 17:52 GMT

దేశంలోకెళ్ల మన రంగారెడ్డినే తోపు అంటే నమ్మగలరా? నిజంగా ఇది నిజం.. మన రంగారెడ్డి జిల్లాను మించిన రిచెస్ట్ జిల్లా దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ఇది తెలంగాణకే గర్వకారణంగా చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి మరో చారిత్రక గౌరవం రంగారెడ్డి జిల్లా ద్వారా దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక వ్యక్తి ఆదాయం (పర్ క్యాపిటా జీడీపీ) కలిగిన జిల్లాగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 జిల్లాల మధ్య రంగారెడ్డి జిల్లా ఈ ఘనత సాధించడం తెలంగాణ ఆర్థిక శక్తిని స్పష్టంగా చాటుతోంది.

ఈ నివేదిక ప్రకారం రంగారెడ్డి జిల్లాలో సగటు వ్యక్తి వార్షిక ఆదాయం రూ.11.46 లక్షలుగా నమోదైంది. ఈ జాబితాలో రెండో స్థానంలో గురుగ్రామ్ (హర్యానా) , ఆ తర్వాత బెంగళూరు అర్బన్, గౌతమ్ బుద్దనగర్ (నోయిడా), హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ముంబై, అహ్మదాబాద్ లాంటి నగర జిల్లాలు ఈ జాబితాలో చాలా వెనుకబడ్డాయి.

వెనుకడిన జిల్లా నుంచి దేశంలోనే నంబర్ వన్ వరకూ..

రంగారెడ్డి జిల్లా ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం.. 2006లో దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ జిల్లా.. కేవలం రెండు దశాబ్ధాల్లోనే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా ఎదగడం విశేషం. ఇది ప్రణాళికబద్దమైన అభివృద్ధి , పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల విస్తరణకు నిదర్శనం.

ఐటీ, ఫార్మా రంగాలే అభివృద్ధికి ఇంజిన్

హైదరాబాద్ ఐటీ కారిడార్ విస్తరణ రంగారెడ్డి జిల్లాకు ప్రధాన బలం. గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల ప్రభావంతో ఐటీ, ఐటీఈఎస్, స్టార్టప్ రంగాలు వేగంగా విస్తరించాయి. బహుళజాతి కంపెనీలు, హైపేయింగ్ ఉద్యోగాలు రావడంతో జిల్లా ఆదాయ స్థాయిలు భారీగా పెరిగాయి. అదేవిధంగా దేశంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ , బయోటెక్నాలజీ హబ్ లలో ఒకటిగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పరిశోధన, తయారీ, ఎగుమతుల ద్వారా పరిశ్రమలకు స్థిరత్వం వచ్చింది. ఇది దీర్ఘకాలిక బలాన్ని అందించింది.

రియల్ ఎస్టేట్ , సేవల రంగానికి ఊపు

హైదరాబాద్ నగరం పరిమితికి చేరుకోవడంతో పరిశ్రమలు, నివాస ప్రాజెక్టులు రంగారెడ్డి జిల్లాలోకి విస్తరించాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ బూమ్, సేవల రంగాల్లో డిమాండ్ పెరిగింది. ఇది ఉపాధి అవకాశాలను మరింత పెంచింది.

మౌలిక వసతుల బలం

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక మౌళిక వసతులు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. మెరుగైన కనెక్టివిటీ గ్లోబల్ యాక్సెస్ వల్ల రంగారెడ్డి జిల్లా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందింది.

తెలంగాణ అభివృద్ధికి ప్రతీక

ఈ విజయం కేవలం ఒక జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మోడల్ కు ప్రతీక. సరైన విధానాలు, మౌలిక వసతులు, పరిశ్రమల ప్రోత్సాహం ఉంటే వెనుకబడిన ప్రాంతాలు కూడా దేశానికి ఆదర్శంగా మారగలవని రంగారెడ్డి జిల్లా నిరూపించింది.

Tags:    
  • rangareddy 
  • telangana 
  • richestdistrict 
  • economicgrowth 
  • percapitaincome 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS