• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  సిగ్గు పడొద్దు... ప్రతీ ...

సిగ్గు పడొద్దు... ప్రతీ పురుషుడూ ఈ ఐదు విషయాలు తెలుసుకోండి!

| ఒకప్పుడు దంపతులకు సంతానం కలగకపోతే నేరం మొత్తం స్త్రీపై వేసేసేవారు! తప్పంతా స్త్రీ దే అని, పురుషుడిది ఏమీ లేదని, అతడికి మగతనం ఉందని చెప్పేవారు!

By - Raja Ch
Update: 2025-12-17 22:30 GMT

ఒకప్పుడు దంపతులకు సంతానం కలగకపోతే నేరం మొత్తం స్త్రీపై వేసేసేవారు! తప్పంతా స్త్రీ దే అని, పురుషుడిది ఏమీ లేదని, అతడికి మగతనం ఉందని చెప్పేవారు! ఇప్పటికీ చాలా చోట్ల ఆ తరహా అజ్ఞానం కనిపిస్తూనే ఉంది! కట్ చేస్తే... పురుషుడి వీర్యం, అందులోని కణాలుపై చర్చ వెలుగులోకి వచ్చిన తర్వాత... సంతానం కలకగపోవడంలో పురుషుడి కీలక పాత్రపై ఒక క్లారిటీ వచ్చింది.

వాస్తవానికి సంతానం కలగడం చాలా అదృష్టం అనే చెప్పాలి! పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతానం కలగని దంపతులను అడిగితే వారి మనోవేదన అర్ధ చేసుకుంటే.. ఈ విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది! ఈ సమయంలో ఒకవైపు మహిళలకు ఉన్న పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యల సంగతి అటుంచితే.. సంతానం విషయంలో పురుషుడి వీర్యం ఆరోగ్యం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

అవును... రోజువారీ బిజీ జీవితం, అదే పనిగా కూర్చుని చేసే ఉద్యోగం, విపరీతమైన కాలుష్యంలో ప్రయాణం, తీవ్రమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, జంక్ ఫుడ్ కి అలవాటుపడిన జీవితం.. ఇక మద్యపానం, ధూమపానం వంటి బోనస్ అలవాట్లు వెరసి ప్రస్తుత సమాజంలో పురుషుడి ఆరోగ్యం, పునరుత్పత్తి సమర్థ్యం తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో ఆరోగ్యానికి ఏదైనా పెద్ద సమస్య వస్తే కానీ తేరుకోలేని స్థితి! అప్పుడు వాకింగ్ లు, జాగింగ్ లు, ఇంటి  భోజనం, సమయానికి నిద్ర, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం వంటివి గుర్తుకు వస్తుంటాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ప్రతీ పురుషుడు తన వీర్యం విషయంలో ఈ ఐదు సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం అతి ముఖ్యం అని అంటున్నారు నిపుణులు!

* వీర్యం రంగు విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... వీర్యం రెగ్యులర్ కలర్ లో కాకుండా పసుపు రంగులో ఉంటే.. అది పచ్చ కామెర్ల వల్ల అయ్యే అవకాశం ఉందని.. లేదా, మీరు ఆల్కహాల్, సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటారని అర్ధం అని అంటున్నారు. ఇక... అదే వీర్యం కాస్త ఆకుపచ్చ, పసుపు మిక్సింగ్ కలర్ లో కనిపిస్తే అది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ / బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం కావొచ్చని గుర్తు చేస్తున్నారు.

* ఇదే క్రమంలో ఆరోగ్యకరమైన వీర్యంలా కాస్త చిక్కగా కాకుండా.. మీ వీర్యం పలచగా ఉందేమో కూడా చెక్ చేసుకోండి. ఒక వేళ కాస్త చిక్కగా కాకుండా నీళ్లగా పల్చగా ఉంటే.. మీ వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందని అర్ధం చేసుకోండి. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని మర్చిపోకండి.

* ఇదే క్రమంలో వీర్యం తక్కువ మోతాదులో స్కలనం అవుతుంటే అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన సమస్య అనే విషయం గుర్తుపెట్టుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంతే... వీర్యం మరీ తక్కువ మోతాదులో వస్తుంతే.. అది ప్రయాణించే నాళ్లాల్లో అడ్డంకులు ఉన్నాయని అర్ధం కావొచ్చని.. దీనివల్ల వీర్య కణాలు గర్భాశయం వరకూ చేరుకోలేవని.. ఫలితంగా సంతానోత్పత్తి జరగదని చెబుతున్నారు!

* ఇదే విధంగా... సాధారణంగా అప్పుడప్పుడు చాలా మందికి వృషణాల వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఇది వాతం వల్ల కావొచ్చని కొంతమంది అనుకుంటే.. కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతుందని మరికొంతమంది భావిస్తుంటారు! అయితే... అలా వాపు లేదా నొప్పి రావడం ఎపిడిడైమిటిస్, హైడ్రోసెల్ లేదా ఇతర ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు!

* ఇక మరో అతి ప్రధాన సమస్య... వీర్యంలో రక్తం చుక్కలు కనిపించడం. అవును... మీ వీర్యంలో రక్తపు చుక్కలు కనిపిస్తే అది క్లామిడియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధి లక్షణం కావొచ్చు. లేదా.. తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు సంకేతమైనా కావొచ్చు.. ఇది నిర్లక్ష్యం చేసే చిన్న సమస్య కాదని మరిచిపోవద్దు!

డిస్క్లైమర్: ఈ వ్యాసంలో పొందుపరిచిన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా సేకరించబడింది. ఇది కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని సమాచారానికి పూర్తి ఖచ్చితత్వం లేదా ఫలితాలకు మేము హామీ ఇవ్వలేము. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, చికిత్సలు లేదా మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.

Tags:    
  • malefertility 
  • semenhealth 
  • reproductivehealth 
  • menshealth 
  • fertilitytips 

Similar News

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు

2026-11-15 20:52 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

క్యాన్సర్ పై పోరులో ముందడుగు.. పర్సనలైజ్డ్ క్యాన్సర్ వాక్సిన్ పై బిగ్ అప్డేట్!

2026-11-15 20:12 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

Copyright @2026

Powered by Blink CMS