• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  మృత్యువు ఎంత దూరం !

మృత్యువు ఎంత దూరం !

By - Satya P
Update: 2026-11-15 05:30 GMT

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీతలోని శ్రీ క్రిష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పినట్లుగా చెబుతూనే సమస్త లోకానికి ఇచ్చిన సందేశం ఇది. పుట్టిన ప్రతీ జీవీ మరణించక తప్పదు అన్నది దీని సారాంశం. ఈ సంగతి సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో బాగా ఎరుక ఉన్న వాడు అన్నీ తెలిసిన వాడు ఒక్క మనిషి మాత్రమే. ఎందుకంటే మనిషికి మెదడు ఉంది కాబట్టి. మిగిలిన జీవులకు ఇవేమీ పట్టవు. అవి ఎపుడు పోతాయో కూడా తెలియదు. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం స్వార్ధంగా జీవిస్తూ ఉంటాడు. తాను ఇక్కడ శాశ్వతం అని అతిశయిస్తాడు. తనకు ఎదురు లేదని మిడిసి పడతాడు. తన కంటే ఎవరూ బలవంతులు లేరని అహంకరిస్తాడు. ఇవన్నీ కూడా అతను మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు చెలరేగిపోయే తీరుగా కనిపిస్తుంది. దానికి ఆధారం చేసుకుని అతని వైఖరి ఇంకా దూకుడుగా ఉంటుంది. మరి ఇంతకీ మృత్యువు తప్పదని అంటున్నారు కదా అది మనిషికి ఎంత దూరం అన్నది కూడా ఇక్కడ మరో ప్రశ్నగా వస్తుంది.

ప్రశ్నలోనే ఎంతో ఉంది :

ఇది కూడా సరైన ప్రశ్నగానే చూడాలి. మృత్యువు మనిషికి ఎంత దూరంలో ఉంది. నిజానికి ఇది అసందర్భమైన ప్రశ్నగా తోచవచ్చు. అంతే కాదు పిచ్చి ప్రశ్నగా కూడా కొన్ని సార్లు అనిపించవచ్చు. మృత్యువు ఏమిటి దూరం దగ్గరేమిటి అని ఎవరైనా వేళాకోళం చేయవచ్చు. కానీ వేదాంత ధోరణిలో ఆలోచన చేసినపుడు ఈ ప్రశ్నలో ఉన్న సహేతుకత అర్ధం అవుతుంది. ఈ ఒక్క ప్రశ్నలో జీవిత సారం కూడా ఇమిడి ఉందని కూడా కచ్చితంగా అనిపిస్తుంది కూడా. ప్రశ్న నుంచే జవాబు కాబట్టి ఇది వివేచనతో కూడిన ప్రశ్నగా చూడాలి. అలాగే తార్కికత నిండా ఇమిడి ఉన్న ప్రశ్నగా కూడా భావించాలి. ఇంతకీ మనిషికి మృత్యువు ఎంత దూరం. ఈ ప్రశ్నను మళ్ళీ మళ్ళీ వేసుకుంటే దీనికి జవాబు అన్వేషించడమే జీవితం మొత్తం గడపడం అన్నది స్పష్టమైన విషయంగా తెలుస్తుంది.

పక్కలో బాంబుగా :

బాగా ఆలోచిస్తే మరో జవాబు కూడా తోస్తుంది. అది ఏంటి అంటే మృత్యువుకు మనిషికి మధ్య దూరం ఏమీ లేదని. అది వెలుగు నీడల దోబూచులాట అని. ఇంకా చెప్పాలంటే పక్కలో బాంబు మాదిరిగా పక్కనే నిరంతరం అట్టేబెట్టుకుని ఉంటుందని. అవును మృత్యువు మనిషికి దూరం అన్నది లేదు, రెండూ పరస్పర విరుద్ధంగా కనిపించినా రెండూ భిన్నంగా అగుపించినా ఒకదానిని ఒకటి వెంటాడుతూనే ఉంటాయన్నది కఠినమైన వేదాంత వాస్తవంగా చూడాలి. భూమి మీద జీవి పుట్టినపుడే మృత్యువు వెంట వస్తుంది. అంటే ఎక్కడైతే జీవి ఉందో ఆ పక్కనే మరణం కూడా ఉంది అన్న మాట. ప్రాణం మరణం ఈ రెండూ కూడా రైలు పట్టాల మాదిరిగా పక్క పక్కనే సాగుతూ ముందుకు పోతాయన్న మాట.

సహజ పరిణామం :

ఇక జీవితం అన్నది అన్ని దశలూ దాటిన తరువాత మృత్యువు వస్తుంది అన్నది మామూలు సహజ సిద్ధమైన భావనగా ఉంటుంది. అయితే ముందే చెప్పుకున్నట్లుగా మృత్యువు దూరాన్ని కొలవడం ఏ భౌతిక వాదానికో ఏ గణిత శాస్త్రానికో వల్ల కానే కాదు. ప్రతీ జీవీ అన్ని దశాలూ దాటాలని నిబంధన కూడా ఏమీ లేదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా దశలు అన్నీ దాటిన పిదప మృత్యువు పలకరిస్తుంది అని భావిస్తే అది అవివేకం కూడా అవుతుంది అంటారు వేదాంతులు. అందువల్ల మృత్యువుకి దగ్గరా దూరం అన్నది లేదు, చివరి దశలో ఉన్న వారే మరణించాలని రూలూ లేదు, ఎవరైనా ఎపుడైనా మృత్యువు బాహు బంధాలలోకి అనివార్యంగా వెళ్ళిపోవచ్చు. అంతే కాదు ఎవరినైనా అది తన కఠినమైన కౌగిలి లోగిలిలోకి పిలిచి మరీ కడతేరనీయవచ్చు.

జీవితాన్ని అందంగా ఆనందంగా :

అందువల్ల మృత్యువు నాకు బహు దూరములే. అది ఇపుడు రాదు ఎపుడో వస్తే వస్తుందిలే అని తాపీగా ఎవరైనా ఉన్నారంటే వారికి జీవితంలో ఏమీ అర్ధం కానట్లుగానే లెక్క. మరి నిరంతరం మృత్యు భయంతో బతకాలా అన్నది కూడా ఒక ప్రశ్న. అలా ఏమీ చేయనక్కర లేదు. కానీ ప్రతీ క్షణం అశాశ్వతం అనుకుంటూ ఉన్నంతలో చేసే మంచి పనులతో తమ ఉనికికి ఈ జీవితానికి శాశ్వతత్వం తెచ్చుకునేలా చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే జన్మ ఎత్తినందుకు సార్ధకత అని గుర్తెరిగి ప్రవర్తించాలి. మొత్తంగా అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఉన్నంతలో జీవితాన్ని అందంగా ఆనందంగా అందరి కోసం బతుకుతూ అందులో తాను కూడా జీవిస్తూ పోతే అదే అసలైన పరమార్ధం అన్నదే సందేశం.

Similar News

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు

2026-11-15 20:52 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

క్యాన్సర్ పై పోరులో ముందడుగు.. పర్సనలైజ్డ్ క్యాన్సర్ వాక్సిన్ పై బిగ్ అప్డేట్!

2026-11-15 20:12 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

Copyright @2026

Powered by Blink CMS