• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కడప జైల్లో జీవిత ఖైదీకి...

కడప జైల్లో జీవిత ఖైదీకి బంగారు పతకం... కారణం 'టాప్'!

| అవును... చదువుకునే వయసులో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. జైల్లో దూర విద్య ద్వారా చదవడం ప్రారంభించాడు.

By - Raja Ch
Update: 2025-09-26 09:30 GMT

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అంటారు. మనిషికి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని చెబుతారు. అది ప్రాక్టికల్ గా చేసి చూపించాడు ఓ జీవిత ఖైదీ. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అతడు.. చదువులో టాప్ గా నిలిచాడు. డిగ్రీలు, పీజీలు చేస్తూ.. నేడు బంగారు పతకం అందుకోబోతున్నాడు.

అవును... చదువుకునే వయసులో హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. జైల్లో దూర విద్య ద్వారా చదవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో జైల్లో ఉంటూనే నాలుగు డిగ్రీలు, మూడు పీజీలు పూర్తి చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మార్కులు సాధించిన అతడు బంగారు పతకం, బుక్‌ ప్రైజ్‌ అవార్డు అందుకోబోతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెంగాలపల్లికి చెందిన జి యుగంధర్‌ (43) ఇంటర్మీడియట్‌ చదువుకునే సమయంలో ఓ మైనర్‌ బాలుడిని కిడ్నాప్‌ చేసి, హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. దీంతో 2010 నుంచి అతడు కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ క్రమంలో జైలు నుంచే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మిడియట్ పూర్తి చేశాడు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ డిస్టెన్ ఎడ్యుకేషన్ లో పాత సిలబస్‌ ప్రకారం రెండు బీఏలు, కొత్త సిలబస్‌ ప్రకారం మరో రెండు బీఏలు పూర్తి చేశాడు. అనంతరం మూడు ఎంఏలు సైతం చదివాడు. జైల్లోనే కంప్యూటర్ శిక్షణ తీసుకున్నాడు. సర్టిఫికెట్ కూడా పొందాడు.

ఈ క్రమంలో బీఏ పరీక్షలో యుగంధర్‌ అత్యధికంగా 8.02 పాయింట్లు సాధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ నెల 30న హైదరాబాద్‌ లో జరిగే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవంలో అతడికి బంగారు పతకం, బుక్‌ ప్రైజ్‌ అవార్డు అందించనున్నారు.

Tags:    
  • GYugandhar 
  • DistanceEducation 
  • GoldMedal 
  • BookPrize 
  • LifeImprisoned 
  • InspiringStory 
  • JailToAcademics 
  • TopScorer 
  • EducationMatters 
  • Determination 
  • TeluguNews 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS