'కొండా' వార‌సురాలి ఎంట్రీ.. ధూంధాం!

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్న కొండా ఫ్యామిలీ నుంచి మురళీ, ఆయ‌న స‌తీమ‌ణి, ప్ర‌స్తుత మంత్రి సురేఖ ఉన్నారు.;

Update: 2025-06-30 23:30 GMT

ఉమ్మ‌డి వరంగ‌ల్ జిల్లా ప‌ర‌కాల ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ నుంచి మ‌రో రాజ‌కీయ నాయ‌కు రాలు రానుందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల నుంచి ఆమె పోటీ చేయ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాలు చేస్తున్న కొండా ఫ్యామిలీ నుంచి మురళీ, ఆయ‌న స‌తీమ‌ణి, ప్ర‌స్తుత మంత్రి సురేఖ ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరి కుమార్తె కొండా సుస్మిత కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారు.

తాజాగా త‌న సోష‌ల్ మీడియా హ్యాండిళ్ల‌లో కొండా సుస్మిత కీలక అప్ డేట్ చేశారు. ``పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న కొండా సుస్మిత`` అంటూ.. పేర్కొన్నారు. అదేవిధంగా ప‌ర‌కాల జంక్ష‌న్‌లోనూ ఆమె ఫ్లెక్సీ లు వెలిశాయి. దీంతో సుస్మిత రాజ‌కీయ ఎంట్రీ దాదాపు కుటుంబం ఒప్పుకొన్న‌ట్టుగానే భావిస్తున్నారు. ని జానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ప‌ర‌కాల నియోజ‌క‌వర్గం నుంచి సుస్మిత పేరు వినిపించినా.. త‌ర్వా త వెన‌క్కి త‌గ్గారు. తాజాగా మాత్రం సుస్మిత సోష‌ల్ మీడియా హ్యాండిళ్ల‌లోనే మార్పు చోటు చేసుకోవ‌డంతో ఇక‌, ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

మ‌రోవైపు.. కొండా ఫ్యామిలీకి, కాంగ్రెస్ స్థానిక నాయ‌కుల‌కు మ‌ధ్య అస‌లు ప‌డ‌డం లేదు. పొరుగు పార్టీల నుంచి వ‌చ్చారంటూ.. కొండా ముర‌ళి తాజాగా కూడా వ్యాఖ్యానించిన‌టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకా దు.. తాము గ‌త ఎన్నిక‌ల్లో 70 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశామ‌ని.. త‌మకున్న పొలంలో కొంత భాగా న్ని కూడా అమ్ముకున్నామ‌ని.. అయినా.. త‌మ‌పై అభాండాలు వేస్తున్నార‌ని ముర‌ళీ విరుచుకుప‌డిన‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఇప్పుడు కొండా వార‌సురాలి ఎంట్రీ అంటూ.. ఫ్లెక్సీలు వెల‌వ‌డం.. సోష‌ల్ మీడియాలోనూ ధూంధాంగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో అస‌లు ఏంజ‌రుగుతోంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై అటు మంత్రి సురేఖ కానీ, ముర‌ళీ కానీ.. రియాక్ట్ కాలేదు.

Tags:    

Similar News