• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొండా సురేఖ తెగింపు వెనక...

కొండా సురేఖ తెగింపు వెనక స్టోరీ ఇదేనా..?

| తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకున్న వేళ, ఆమె వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడికి దిగారు.

By - Garuda Media
Update: 2026-08-24 18:30 GMT

తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరందుకున్న వేళ, ఆమె వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడికి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సురేఖ ఇప్పటికే వివరణ ఇచ్చారు. త‌న కుమార్తె వ్యాఖ్య‌లు ఆమె వ్య‌క్తిగ‌త‌మంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. సొంత పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆమెను పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేయడం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సురేఖ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి మరో లేఖ రాస్తూ.. విచారణ పూర్తికాకముందే తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేయిస్తున్న పార్టీ నేత‌ల‌పై ముందు చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ రాజకీయ పోరులో కొండా సురేఖ అత్యంత వ్యూహాత్మకంగా బీసీ సెంటిమెంట్, సామాజిక న్యాయం అనే అంశాలను తెర‌మీద‌కు తెచ్చేశారు. కేబినెట్‌లో సీనియర్ బీసీ మహిళా నేతనైన తనను టార్గెట్ చేస్తూ, దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వేధింపులకు గురిచేస్తుంటే పార్టీ అధిష్టానం నిశ్శబ్దంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, ఇతరుల అభిప్రాయాలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారంటూ ప్ర‌శ్నించారు. మైండ్ గేమ్స్ ద్వారా తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తే బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే సంకేతాన్ని అధిష్టానానికి పంపడం ద్వారా తన మంత్రి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గ‌త కొంత కాలంగా కొండా సురేఖ‌ను ప్ర‌క్షాళ‌న‌లో కేబినెట్ నుంచి త‌ప్పించి ఆమె స్థానంలో మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టేలా... అలాగే త‌న మంత్రి ప‌ద‌విని కాపాడుకునేలా తాజా ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకే ఆమె బీసీ వ్యూహాన్ని తెర‌మీద‌కు తెచ్చిన‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈ బీసీ కార్డు వ్యూహం సురేఖను ఎంతవరకు గట్టెక్కిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి భూముల కేటాయింపులపై సుస్మిత నేరుగా దాడి చేయడాన్ని కాంగ్రెస్ హైకమాండ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో సురేఖపై సస్పెన్షన్ వేటు వేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖ వివరణతో సంతృప్తి చెందలేదు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటన ముగించుకుని రాగానే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీ వర్గాల అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాకాకుండా వదిలేస్తే సీఎంపై ఆరోపణలు చేసినా చర్యలు ఉండవనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఈ క్రమంలో కొండా సురేఖ విసిరిన బీసీ అస్త్రం ముందు కాంగ్రెస్ హైకమాండ్ తగ్గుతుందో లేక క్రమశిక్షణా చర్యలతో చెక్‌మేట్ పెడుతుందో వేచి చూడాలి.

Tags:    
  • kondasureka 
  • telangana 
  • telanganacongress 
  • revanthreddy 
  • congress 

Similar News

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

2026-11-24 00:28 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

2026-11-24 00:27 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

Copyright @2026

Powered by Blink CMS