రేవంత్ ఇంటి వద్ద టీడీపీ జెండాలు... కోమటిరెడ్డి కామెంట్స్ వైరల్!

ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఈ రోజు ఉదయం నుంచీ ఎగ్జాట్ పోల్స్ విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తుంది

Update: 2023-12-03 07:55 GMT

ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఈ రోజు ఉదయం నుంచీ ఎగ్జాట్ పోల్స్ విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తుంది. ఈ విజయం కాంగ్రెస్ పై ప్రేమకంటే ఎక్కువగా బీఆరెస్స్ పాలనపై ప్రజల ఆగ్రహం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది.

అవును... తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్స్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రెండేళ్లుగా పార్టీకోసం విపరీతంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో... రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా చేరారు. ఇదే సమయంలో రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు రేవంత్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సమయంలో రేవంత్ ఇంటి బయట సీఎం సీఎం అనే నినాదాలు భారీగా వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు టీడీపీ జెండాలు, లోకేష్ - చంద్రబాబు ఫోటోలతో కూడిన ఫ్లాగ్ లూ కనిపిస్తుండటం ఆసక్తిగా మారింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో టీడీపీ పాత్రను కొట్టిపారేయలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇది బీఆరెస్స్ మార్కు రాజకీయానికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు లేకపోలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు. అనధికారికంగా కాంగ్రెస్ గెలుపు కన్ ఫాం అయిన నేపథ్యంలో ఆయన గాంధీ భవన్ కు వెళ్తున్నారు. మరోపక్క ఈ గెలుపు రాహుల్ గాంధీ సొంతమని, భారత్ జూడో యాత్ర ఫలితమని ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి వ్యవహరం అంత సాఫ్ట్ గా తేలేది కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News