కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో ఉన్న వారందరిని తానే పంపించినట్లు చెప్పి అందరిలో ఆశ్చర్యం నింపగా ఇప్పుడు కోమటిరెడ్డి సైతం ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-05-08 09:56 GMT

కాంగ్రెస్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటే. అధికారంలో లేనప్పుడు కూడా తనదైన శైలిలో మాట్లాడటం సహజమే. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి మరోమారు బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెబుతున్నారు. ఆ పార్టీ నేతలు అంతా మాతో టచ్ లో ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.

నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో ఉన్న వారందరిని తానే పంపించినట్లు చెప్పి అందరిలో ఆశ్చర్యం నింపగా ఇప్పుడు కోమటిరెడ్డి సైతం ఆయనకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు మొత్తం కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పడంతో అందరు ఖంగుతిన్నారు. మొత్తానికి ఇద్దరు నేతలు పోటాపోటీ ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు.

జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని కోమటిరెడ్డి చెప్పడంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పడంతో ఆ నేతల్లో కంగారు పుడుతోంది. పునర్విభజన తరువాత రాష్ట్రంలో 154 సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఇందులో 125 కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారంటీల అమలుతో రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత రాష్ట్ర పరువు తీసిందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె ఇక జైల్లోనే ఉంటారని చెబుతున్నారు. కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 15 సీట్లు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News