కోల్ కతా రే*ప్ కేసు మెడికల్ రిపోర్ట్.. తెరపైకి షాకింగ్ విషయాలు!

తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. ఇందులో.. ఆమెపై శారీరక దాడి జరిగినట్లు అనేక గుర్తులు ఉన్నట్లు చెబుతున్నారు.;

Update: 2025-06-28 17:57 GMT

జూన్ 25న కోల్‌ కతాలోని లా కాలేజ్ క్యాంపస్ లో అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల విద్యార్థినికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదిక తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ దీనికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. ఇందులో.. ఆమెపై శారీరక దాడి జరిగినట్లు అనేక గుర్తులు ఉన్నట్లు చెబుతున్నారు.

అవును... కోల్ కతాలోని లా కాలేజ్ క్యాంపస్ లో అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలి మెడికల్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. బాధితురాలి మెడ, ఛాతీపై గాయాల గుర్తుఉన్నట్లు మెడికల్ రిపోర్ట్ లో వెల్లడైందని అంటున్నారు. ఆ భాగాలతో పాటు ఆమె వ్యక్తిగత అవయువాలను గాయపరిచినట్లు చెబుతున్నారు.

జూన్ 26న రాత్రి 10 గంటలకు కోల్‌ కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి పరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్‌ లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. కోల్‌ కతాకు చెందిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలో ఈ కేసును దర్యాప్తు చేస్తుందని ఒక అధికారి తెలిపారు.

ఇక, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. నాల్గవ వ్యక్తి , సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేసినట్లు కోల్‌ కతా పోలీసులు శనివారం ధృవీకరించారు. సంఘటన జరిగిన సమయంలోని సీసీటీవీ ఫుటేజ్ లో అతడు పరిశరాల్లోనే ఉన్నట్లు తెలిసిందని అంటున్నారు.

ఈ అరెస్టుతో.. ఈ కేసులో ఇప్పటివరకూ అదుపులోకి తీసుకున్న వ్యక్తుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు.. సెక్యూరిటీ గార్డును బలవంతంగా ఖాళీ చేయించిన తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News