మెంటల్ హాస్పిటలా..? మంత్రివర్గమా?.. వైసీపీ నేత పేర్ని సంచలన వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని సంచలన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు తమకు కేటాయించిన శాఖలు చూడటం లేదని ఆరోపించారు.

Update: 2026-06-08 13:10 GMT

కూటమి ప్రభుత్వంపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని సంచలన విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు తమకు కేటాయించిన శాఖలు చూడటం లేదని ఆరోపించారు. మంత్రులు తమ శాఖలకు బదులుగా పక్కవారి శాఖలను చూడటం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. మంత్రుల వ్యవహారం చూస్తే ఇదేమేనా మెంటల్ హాస్పిటలా? అనే అనుమానం కలుగుతోందన్నారు పేర్ని నాని. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని మంత్రులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత బ్యాటరీ సైకిళ్లు తొక్కుతూ షూటింగులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఇద్దరి కోసం వందల మంది పోలీసులు వెనక సైకిళ్లు తొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. అలా సైకిల్ పై కష్టపడుతున్న పోలీసులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు మాత్రం విడుదల చేయడం లేదని ఆరోపించారు. పోలీసుల సరెండర్ లీవులకు ఇప్పటికీ డబ్బు చెల్లించలేదన్నారు. ప్రభుత్వంలో అన్ని శాఖలను మోసం చేసినట్లే కానిస్టేబుళ్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లకు ఆరు సరెండర్ లీవులు బకాయి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేరుకే డిప్యూటీ సీఎం కానీ ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రమే అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కు కేటాయించిన శాఖలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో చాలా గమ్మత్తు అయిన చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.. హోంమంత్రి ఏమో విద్యాశాఖ చూస్తారు, విద్యాశాఖ మంత్రి పరిశ్రమల శాఖ చూస్తారు. ఆ శాఖ చూడాల్సిన మంత్రి కర్నూలులో లా అండ్ ఆర్డర్ చూస్తారు. ఇరిగేషన్ మంత్రి ఇంధన పొదుపు చూస్తారు? ఇదేంటి ఎవరికి వారు పనిచేయరు? అంటూ మాజీ మంత్రి పేర్ని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో మంత్రులపై మాజీ మంత్రి పేర్ని చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత టార్గెట్ గా నాని గుప్పించిన విమర్శలు రాజకీయంగా కాకరేపుతున్నాయని అంటున్నారు. కానిస్టేబుల్ కుమారుడిని అంటూ చెప్పుకున్న డిప్యూటీ సీఎం పవన్ కానిస్టేబుళ్ల సమస్యలను పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అంటున్నారు. అదేవిధంగా హోంమంత్రి అనిత క్రిస్టియన్ నుంచి హిందూమతానికి మారినట్లు, ఏపీఎస్పీ పోలీసుల డిపార్ట్మెంట్ ఎందుకు మార్చడం లేదని నిలదీశారు.

Tags:    

Similar News