• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియా కూటమి ప్రధాని...

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఆయనే?

| ఇండియా కూటమి నాయకుడిగా ఉన్న వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగానూ పరిగణించాల్సి వస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-01-13 12:18 GMT

పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న బీజేపీని ఎలాగైనా ఇంటికి పంపాలనే లక్ష్యంతో ఉన్న ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాల్లో పోటీ పడుతున్నా.. జాతీయ స్థాయిలో కలిసి నడిచేందుకు చొరవ చూపుతున్నాయి. ఒకదానికొకటి సర్దుకుపోతున్నాయి. దాదాపు ఏడాదినుంచి సమావేశం అవుతూ వస్తున్నాయి. అయితే, మరొక్క నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున కూటమి నాయకుడు ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

అటు మోదీ.. ఇటు ఆయన

ఇండియా కూటమి నాయకుడిగా ఉన్న వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగానూ పరిగణించాల్సి వస్తుంది. కూటమికి అధికారానికి సరిపడా సీట్లు వస్తే.. సహజంగా దాని నాయకుడికే ప్రధాని అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నరేంద్ర మోదీ ఇప్పటికే పలుసార్లు తాను బీజేపీ తరఫున మూడోసారీ ప్రధాని అభ్యర్థిని అని స్పష్టంగా ప్రకటించారు. ఆయన నోటి నుంచి హ్యాట్రిక్ మాట వస్తోంది. అంటే.. మరోసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే మోదీనే ప్రధాని. మరి ఇటువైపు ఇండియాలో ప్రధాని అభ్యర్థి ఎవరో తేలలేదు. దీనిని మోదీ ఇప్పటికే పలుసార్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దీనిని తిప్పికొట్టేలా ప్రతిపక్షాలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, ఇండియా నేతలు శనివారం వర్చువల్ గా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సహా పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కూటమి ఛైర్‌ పర్సన్‌గా కాంగ్రెస్ మల్లికార్జున్‌ ఖర్గే ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంటోంది.

ప్రధాని అభ్యర్థి ఆయనే..?

ఇండియా కూటమి అధ్యక్ష పదవికి జేడీయూ నేత, బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ పేరు చాలాసార్లు వినిపించింది. అయితే, ఆయనను కన్వీనర్ గా ఉండమని సూచించగా.. తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాస్త ఆగ్రహంగా.. ఈ పదవికి కూడా కాంగ్రెస్‌ వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు సీట్ల సర్దుబాటుపై సమావేశంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఇండియా చైర్మన్ గా ఖర్గే ఎంపికవడంతో లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా కూడా ఆయననే ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ మేరకు మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు నేతలు ఇప్పటికే ప్రతిపాదించిన చేశారు.

Tags:    
  • Indiaallaince 
  • Pmcandate 
  • malikarjunakhargey 
  • Congress 
  • Jds 
  • Nitish 
  • mamathabenarge 
  • Bjp 
  • Modi 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS