• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కల్యాణ్ ని ఇమిటేట్...

పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేసిన కేతిరెడ్డి... వీడియో వైరల్!

| "ఏమిటీ కరెంట్ చార్జీలు ఇదంతా.. ఎలా పెంచుతారు.. దీనికి ఎవరు.. అంటూ ఊగుతూ ఊగుతూ మాట్లాడారు.. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు.." అంటూ పవన్ వాయిస్ ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి.

By - Tupaki Desk
Update: 2024-12-27 10:57 GMT

ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి.. ప్రజలను నమ్మించి.. లబ్ధి పొంది.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలపై విద్యుత్ చార్జీల భారం విపరీతంగా మోపుతోందని.. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరు బాట చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏపీలో కూటమి (టీడీపీ, జనసేన బీజేపీ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపుతున్నారని.. ఇది చంద్రబాబు మార్కు 'బాదుడు' అంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు విద్యుత్ చార్జీలు పెంచుతున్న సీఎం చంద్రబాబు పైనా.. ప్రశ్నిస్తానని చెప్పి మౌనాన్ని తన భాషగా చేసుకున్నట్లు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు నమ్మించి కాటేశారని మండిపడుతున్నారు. ఈ సమయంలో కేతిరెడ్డి వెటకారం వైరల్ గా మారింది.

అవును... ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపుతున్నారని ఫైరవుతూ వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కారక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ధర్మవరం నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా... ఎస్బీఐ కాలనీలోని కేతిరెడ్డి కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లాయి వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా కెతిరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు.. విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేతిరెడ్డి.. పవన్ కల్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ వెటకారమాడారు!

ఇందులో భాగంగా... ప్రస్తుతం మనం 2:40 పైసలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని.. దాన్ని కూడా అదానీ పేరు చెప్పి రాద్ధాంతం చేశారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా... విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పాడని, కూటమిలో భాగస్వామి అయిన పవన్ కల్యాణ్ కూడా చెప్పాడని అన్నారు.

ఈ సందర్భంగా... ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కూడా... "ఏమిటీ కరెంట్ చార్జీలు ఇదంతా.. ఎలా పెంచుతారు.. దీనికి ఎవరు.. అంటూ ఊగుతూ ఊగుతూ మాట్లాడారు.. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు.." అంటూ పవన్ వాయిస్ ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారు కేతిరెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టిందని అంటున్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా ఈరోజు (27-12-2024) వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట, SBI కాలనీలోని కేతిరెడ్డి కార్యాలయం నుండి మార్కెట్ లోని విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్ళి విద్యుత్ అధికారులకు వినతి పత్రం… pic.twitter.com/wMDN5bdQKw

— Kethireddy Venkatarami Reddy (@KethireddyMla) December 27, 2024

మా అన్న ఇన్ని రోజులు పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నాడు అని అనుకున్నారు కదా బైటకి వస్తే ప్రతిపక్షం ని తనదైన శైలిలో విమర్శలు చేస్తే మీరు తట్టుకోలేరు రా googlemaps minister చూస్తావ్ గా కేతి రెడ్డి ఆడించే ఆట pic.twitter.com/KyLU38fy0R

— కేతిరెడ్డి వర్గం (@kethireddy_ysr) December 27, 2024
Tags:    
  • Andhrapradesh 
  • YCP 
  • KethireddyVenkatramiReddy 
  • Pawankalyan 
  • AllianceGovernment 
  • ElectricityDepartment 
  • ImitatingPawankalyan 
  • TDP 
  • BJP 
  • Chandrababu 
  • Politicalnews 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS