దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చే సీట్లపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు!

లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా... బస్సు యాత్రలో హన్మకొండలో చేపట్టిన బస్సుయాత్రలో జరిగిన రోడ్‌ షోలో ప్రసంగించిన కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-29 03:53 GMT

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు దశల్లోనూ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో... మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఏపీలో అటు శాసన సభకు, ఇటు లోక్ సభకూ ఎన్నికలు జరగబోతుండగా.. తెలంగాణలో లోక్ సభకు జరగబోతున్నాయి. ఈ క్రమంలో.. త్రిముఖ పోరు సాగనున్న తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి.

ఈ క్రమంలో... అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయం గాలివాటం కాదని నిరూపించాలని, ఫలితంగా లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుండగా... తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పాలని బీజేపీ భావిస్తుందని అంటున్నారు. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన గాయానికి.. లోక్ సభ ఎన్నికలతో మందు రాయాలని బీఆరెస్స్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్న కేసీఆర్... బీజేపీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్న వేళ... కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇందులో భాగంగా... బీజేపీకి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇదే సమయంలో... కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్‌ లో బీఆరెస్స్ పాత్ర కీలకం అవుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు.

లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా... బస్సు యాత్రలో హన్మకొండలో చేపట్టిన బస్సుయాత్రలో జరిగిన రోడ్‌ షోలో ప్రసంగించిన కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా అని.. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా అని చెప్పిన కేసీఆర్... ఓరుగల్లు మట్టితో తనదిది విడదీయరాని బంధం అని తెలిపారు.

Read more!

తమ ప్రభుత్వ హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చుకున్నట్లు తెలిపారు. అనంతరం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డి విచిత్రమైన మాటలు మాలాడుతున్నారని చెప్పిన ఆయన... ఇప్పుడున్న సీఎంకు తెలంగాణ చరిత్రా లెవదు.. భౌగోళం తెలియదని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా... ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితిని అని తనదైన శైలిలో స్పందించిన కేసీఆర్... ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసిందని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో... తెలంగాణ గొంతుకోసి గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడంటూ మోడీపై ధ్వజమెత్తారు.

ఆ విధంగా మోడీ.. గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం మూతి ముడుచుకొని కూర్చున్నాడని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా... బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ అని చెప్పిన కేసీఆర్... ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప ఆ పార్టీకి మరో ప్రణాళిక లేదని.. వారి ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవని తెలిపారు. ఈ సందర్భంగా... గోదావరి, కృష్ణా జలాలను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్స్ గెలవాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News