• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమితాబ్ షోలో 'ఆపరేషన్...

అమితాబ్ షోలో 'ఆపరేషన్ సింధూర్' నాయికలు.. స్ట్రీమింగ్ అప్పుడే?

| ఈ విధంగా ఈ ముగ్గురు రియల్ రాణి రుద్రమదేవిలు ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతంగా వర్ణించినట్టు ఈ ప్రోమోలో చూపించారు.

By - Madhu Reddy
Update: 2025-08-13 10:20 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ క్రేజ్ కు తగ్గట్టే ఆయన చేసే షో 'కౌన్ బనేగా కరోడ్ పతి'. అయితే ఈ షో 17వ సీజన్ కోసం చాలామంది స్పెషల్ గెస్ట్ లను పిలిచారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. అయితే ఈ సందర్భంగా దేశం కోసం పోరాడి, గెలిచిన నిజమైన హీరోలను మనకు చూపించబోతున్నారు. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే..ఆడ పులులు.. "ఆపరేషన్ సింధూర్" తో అద్భుతాలు సృష్టించిన ముగ్గురు మహిళ అధికారులు.. వీరిలో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోషియో ఖురేషి, కమాండర్ ప్రేరణ డియోస్తలి రాబోతున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ షోలో వారు పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఈ ముగ్గురు అధికారులు ఆపరేషన్ సింధూర్ లో ఎదుర్కొన్న ఆసక్తికర విషయాల గురించి తెలియజేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి కల్నల్ ఖురేషి మాట్లాడుతూ.. "ఆపరేషన్ సింధూర్ అనేది తప్పనిసరి చర్య అన్నారు". ఆ సమయంలో అది ఎందుకు అవసరమో కూడా తెలియజేశారు. వ్యోమికా సింగ్ , ప్రేరణ కూడా ఇదే విషయాన్ని బయట పెట్టారు. పాకిస్తాన్ ఈ విధంగా పదే పదే భారతదేశాన్ని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధం తప్పనిసరి అయిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ అనేది కేవలం 25 నిమిషాల్లో పూర్తయిందని వ్యోమికా సింగ్ తెలియజేశారు. ఈ టైంలోనే అనుకున్న లక్ష్యాలను ఛేదించామని కమాండర్ ప్రేరణ డియోస్తలి అన్నారు.

ఈ విధంగా ఈ ముగ్గురు రియల్ రాణి రుద్రమదేవిలు ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతంగా వర్ణించినట్టు ఈ ప్రోమోలో చూపించారు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పూర్తి షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని ప్రోమో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఫుల్ ఎపిసోడ్ వస్తోంది. అయితే విడుదలైన ప్రోమో పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.

ఎందుకంటే ప్రోటోకాల్ ని ఈ ముగ్గురు అధికారులు ఉల్లంఘించారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటివరకు చాలా దేశాల్లో చాలా యుద్ధాలు జరిగాయి. కానీ ఇలా ఏ సైనిక అధికారి కూడా యూనిఫాం ధరించి ఎంటర్టైన్మెంట్ షోలకు వెళ్లలేదు. మొదటిసారి వీళ్లు ఈ దేశంలో షో కి యూనిఫాం వేసుకొని వచ్చారు.. భారతదేశ సాయుధ దళాలకు ఎంతో గౌరవం ఉంది. అలాంటి గౌరవ మర్యాదల్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి అంటూ ఈ అధికారులు చేసిన పనిపై మండి పడుతున్నారు. యూనిఫామ్ వేసుకుని ఎంటర్టైన్మెంట్ షోకి ఎలా వస్తారంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Tags:    
  • KBC17 
  • OperationSindoor 
  • WomenOfficers 
  • MilitaryProtocol 
  • ColonelQureshi 
  • VyomikaSingh 
  • PrernaDeosthalee 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS