కవితక్క పార్టీ...లైట్ తీస్కో !

ఇక కవిత తన పార్టీని టీఆర్ఎస్ అని ప్రకటించినపుడే అందులో కొత్తదనం పోయింది అని అంటున్నారు.;

Update: 2026-04-27 17:31 GMT

రాజకీయాల మీద జనంలో వచ్చిన మార్పా లేక కొత్త పార్టీల మీద పెదవి విరుపా అన్నది తెలియదు కానీ కవితక్క పార్టీ మీద అయితే పెద్దగా చర్చ అయితే సాగడం లేదు. ఎందుకంటే అన్నీ ఆ తానులో ముక్కలే అన్నది జనాల నిశ్చితాభిప్రాయం కావచ్చు. ఇక కవిత అంటే ఆమె కేరాఫ్ కేసీఆర్ అన్న ట్యాగ్ తోనే రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ రోజుకు కూడా ఆమెను అలాగే చూస్తున్నారు ఆమె సొంత ముద్ర ఉండాలంటే దానికి తగిన విధంగా రాజకీయం చేయాలి. అయితే ప్రాంతీయ పార్టీలలో అయితే అధినేత ఇమేజ్ మీదనే అంతా సాగిపోతుంది. అందులో నుంచి మరో పార్టీ పుట్టుకుని రావడం కష్టం. అందుకే జాతీయ పార్టీల నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన వారే ఎక్కువగా రాణించారు.

ప్రభావవంతమైన పాత్ర :

ఇక బీఆర్ఎస్ లో కవిత ప్రభావవంతమైన పాత్ర పోషించినది కూడా పెద్దగా లేదు. ఆమె 2014 నుంచి 2019 దాకా లోక్ సభ ఎంపీగా ఉన్నారు. అలా ఆమె ఎక్కువగా ఢిల్లీలో ఉండేవారు. ఇక 2019 లో ఓటమి పాలు అయ్యారు, ఎమ్మెల్సీగా చేశారు. దాంతో ఆమె పరోక్ష పాత్ర మరింతగా పెరిగింది. ఆమె తెలంగాణాలో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో దూకుడుగా ఉన్న సందర్భాలు పెద్దగా లేవు రాష్ట్ర మంత్రిగానో లేక పార్టీలో నంబర్ టూ నంబర్ త్రీ లేదా టాప్ లీడర్లలో ఒకరుగా చేస్తే ఎంతో కొంత ఫోకస్ ఉండేది అన్న విశ్లేషణలు ఉన్నాయి.

పేరు నుంచి అన్నీ :

ఇక కవిత తన పార్టీని టీఆర్ఎస్ అని ప్రకటించినపుడే అందులో కొత్తదనం పోయింది అని అంటున్నారు. పైగా ఆమె మేనిఫెస్టో కానీ పాంచజన్యం పేరుతో ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా పెద్దగా జనాల్లో క్లిక్ అయ్యేవి కావని అంటున్నారు. అందులో చెప్పిన విషయాలు అంతకు ముందు చాలా మంది చెప్పినవే అని గుర్తు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పుట్టాలన్నా పెట్టాలన్నా జనంలో ఉన్న ఎమోషన్స్ ని కనెక్ట్ చేయాలి. కానీ కవితక్క పార్టీ అయితే ఆ విధంగా లేదని అంటున్నారు. మహా కవి శ్రీ శ్రీ బాధ ప్రపంచ బాధ అన్నట్లుగా రాజకీయాల్లో నాయకుల బాధ ప్రపంచ బాధ కావాల్సి ఉంటుంది. అంతే తప్ప తన సొంత బాధని ప్రపంచ బాధగా చేయాలనుకుంటే ఎక్కడా సక్సెస్ అయిన సూచనలు అయితే లేవని అంటున్నారు.

కావాలనే చేస్తున్నారా :

నిజానికి రాజకీయాల్లో పెద్దగా ఉనికి లేని పార్టీలను ప్రధాన పార్టీలు పట్టించుకోవు. అలాగే కొత్త పార్టీలు వచ్చినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తాయి. ఇదొక వ్యూహంలో భాగం. ఎందుకంటే తాము మాట్లాడితే కోరి ఆ పార్టీలకు ప్రచారం ఇచ్చినట్లు అవుతుందని. అలాగే కవిత పార్టీ విషయంలోనూ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ సాగుతోంది. ఎన్నో పార్టీలు వస్తూంటాయి మాది పాతికేళ్ళ పార్టీ అని కేటీఆర్ అంటే ఉన్న పార్టీకే దిక్కు లేదు మరో కొత్త పార్టీనా అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ ని కలిపి మరీ ఒక గాటన కట్టేశారు. బీఆర్ ఎస్ అయితే దొర పార్టీకి తోడు దొరసాని పార్టీనా అని కామెంట్స్ చేసింది. రాజకీయ పార్టీల మాటలు ఇలా ఉంటే జనసామాన్యంలో కానీ మేధావులలో కానీ కవితక్క పార్టీ మీద సీరియస్ గా చర్చ అయితే సాగడం లేదని అంటున్నారు. చూడాలి ముందు ముందు ఆమె పార్టీని నడిపే తీరు అలాగే ఆమె అనుసరించే వ్యూహాల బట్టి ఏమైనా డిస్కషన్ పాయింట్ అవుతుందేమో అని అంటున్నారు.

Tags:    

Similar News