• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒకే ఒక్కడు మూవీలో మాదిరి...

ఒకే ఒక్కడు మూవీలో మాదిరి కామారెడ్డి ఎమ్మెల్యే ప్రయోగం

| ఇటీవల ముగిసిన ఎన్నికల్లో అందరి చూపు పడిన ఏకైక ఎమ్మెల్యే కామారెడ్డి నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

By - Tupaki Desk
Update: 2024-02-12 08:30 GMT

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో అందరి చూపు పడిన ఏకైక ఎమ్మెల్యే కామారెడ్డి నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మరే ఎమ్మెల్యే అభ్యర్థి చేయని రీతిలో ఆయన వినూత్న ప్రచారం చేశారు. తనను ప్రజలు గెలిపిస్తే.. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించేందుకు రూ.100 కోట్ల సొంత ఆస్తులతో డెవలప్ మెంట్ పనులు చేస్తానని.. ప్రభుత్వం ఏదైనా తనకు ఒక్కటేనని తేల్చేయటం తెలిసిందే.

అంతేకాదు.. ఆయన పోటీ పడింది అలాంటి ఇలాంటి వారితో కాదు. ఇద్దరు సీఎం అభ్యర్థులతో పోటీ పడిన ఆయన.. కేసీఆర్.. రేవంత్ రెడ్డిలను ఓడించి మరీ ఎమ్మెల్యేగా ఎన్నికై సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళలో చెప్పే మాటలకు భిన్నంగా.. చేతలతో తానేమిటో చూపిస్తూ తరచూ వార్తల్లోకి వస్తున్నారు. మొన్నటికి మొన్న రోడ్డు విస్తరణ కోసం తన పూర్వీకులు కట్టించిన ఇంటిని తానే దగ్గరుండి ప్రొక్లెయిన్లతో కూల్చేసి అందరికి ఆదర్శంగా మారిన ఆయన.. తాజాగా అప్పట్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'ఒకే ఒక్కడు'లో మాదిరి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డి నియోజకవర్గం మొత్తం ఫిర్యాదుల పెట్టెల్ని ఏర్పాటు చేయించారు.

నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా సరే.. తమకు ఏదైనా సమస్య ఉంటే.. తమకు దగ్గర్లో ఉన్న ఫిర్యాదు పెట్టెలో వేస్తే సరి. దానిని తాను చెప్పించుకొని ఆ సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని కమాన్ వద్ద ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సును ఆయన ప్రారంభించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి ఫిర్యాదుల పెట్టెల్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు తానే గ్రామానికి స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని చెప్పటం విశేషం. ప్రజలంతా తమ ఫిర్యాదుల్నిబాక్సుల్లో వేయాలని కోరుతున్నారు. ఆయన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

Tags:    
  • Katipallyvenkataramana 
  • Venkataramanareddy 
  • Complaintboxes 
  • BJP 
  • Telanaganpolitics 
  • Kamareddymla 

Similar News

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

Copyright @2026

Powered by Blink CMS