నో 'టీ', నో 'కాఫీ'... చిరు వ్యాపారుల షాకింగ్ నిర్ణయం!

అవును... జీఎస్టీ పై దేశంలో విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్డీ కొట్టులకు, కాయగూరల బండ్లకు, టీ షాపులకు జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని చెబుతున్నారు!;

Update: 2025-07-23 11:30 GMT

తాజాగా బెంగళూరులో కూరగాయల వ్యాపారి శంకర్ గౌడ్‌ కు నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల టర్నోవర్ ఆధారంగా రూ.29 లక్షలకు జీఎస్టీ నోటీసు వచ్చిన సంగతి తెలిసిందే! దీంతో ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ దెబ్బతో యూపీఐ పేమెంట్లకు శంకర్ గౌడ స్వస్తి చెప్పారు. ఈ సమయంలో... కర్ణాటక రాష్ట్రంలోని చిరు వ్యాపారులు అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. వినూత్న నిరసన చేపట్టారు.

అవును... జీఎస్టీ పై దేశంలో విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బడ్డీ కొట్టులకు, కాయగూరల బండ్లకు, టీ షాపులకు జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని చెబుతున్నారు! ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఈరోజు తామంతా బ్లాక్‌ బ్యాండ్స్ ను ధరించామని.. ఈ క్రమంలో ఏ బేకరీలోనూ పాల విక్రయాలు జరపడం లేదని.. నిరసనకు గుర్తుగా బ్లాక్‌ టీ మాత్రమే అమ్ముతున్నామని కార్మిక హక్కుల కార్యకర్త రవిశెట్టి అన్నారు. అయితే... ప్రస్తుతానికి మిగతా వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.

తమ అసమ్మతి తెలియజేసేలా ట్రేడర్లు బ్లాక్‌ టీ, బ్లాక్‌ కాఫీని మాత్రమే అమ్ముతున్నరని.. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే.. తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో భాగంగా యూపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి "క్యాష్ ఓన్లీ" విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా... జులై 25న బెంగళూరులో భారీ ర్యాలీ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఇరు వ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు సీఎం సిద్దరామయ్య వారిని ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివాన కాకముందే ఈ విషయంపై ఓ క్లారిటీకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా... 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం డ్రైవ్‌ చేపడుతోంది. ఇందులో భాగంగా... రూ.20 లక్షలు (సేవలు), రూ.40 లక్షలు (వస్తువులు) దాటిన ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో... చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News