మహిళా పొలిటీషన్స్ కు 'ఆ రోజులు' పెద్ద సవాల్ : కంగనా రనౌత్

స్టార్ హీరోయిన్ బాలీవుడ్ ను ఏలిన కంగనా రనౌత్ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు బాలీవుడ్ క్వీన్ కంగనా.;

Update: 2025-08-16 10:30 GMT

స్టార్ హీరోయిన్ బాలీవుడ్ ను ఏలిన కంగనా రనౌత్ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు బాలీవుడ్ క్వీన్ కంగనా. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సవాళ్లు ఎదుర్కొవడానికి సిద్ధపడుతుంటారు. ఇక తను చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు కంగనా. మహిళా సాధికారత, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించే విషయం ఏ మాత్ర వెనుకాడరు. తాజాగా మహిళలు ఎదుర్కొనే ఒక సున్నితమైన సమస్యపై స్పందించారు కంగనా.

ఢిల్లీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె రాజకీయ జీవితం, వ్యక్తిగత అనుభవాల గురించి వెల్లడించారు. మహిళలు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత కాపాడుకోవడం, ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలు చేసే రాజకీయ నాయకురాలిగా ఉంటే ఎంత కష్టమో వివరించారు.

“రాజకీయాల్లో లగ్జరీలు లేవు”

“నటిగా ఉన్నప్పుడు షూటింగ్‌లో పూర్తి సౌకర్యాలు ఉండేవని చెప్పుకొచ్చారు. కారవ్యాన్లు, స్నానం చేసే సదుపాయాలు, కావలసినంత సౌలభ్యం ఉంటుందని వెల్లడించారు. కానీ రాజకీయ పర్యటనల్లో రోజుకు 12 గంటలకు పైగా బస్సుల్లో, రోడ్ల మీద ప్రయాణించాల్సి ఉంటుందని, మధ్యలో మరుగుదొడ్లు కూడా లభించవంటూ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఇది తన సమస్య మాత్రమే కాదని, ఇతర మహిళా ఎంపీలకు కూడా పెద్ద సమస్యే” అని ఆమె చెప్పుకొచ్చారు.

సంప్రదాయాలపై వ్యక్తిగత అనుభవం

మహిళలు పీరియడ్స్ సమయంలో ఆలయాల్లోకి, వంటగదిలోకి వెళ్లరాదనే నమ్మకాలపై తన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ‘‘చిన్నప్పుడు నేను కూడా ఆ నియమాలు పాటించాను. అయితే నా తల్లి ఎప్పుడూ ఇది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం అని చెప్పేది. ఆ రోజుల్లో నేను చాలా అసహనంగా ఉండేదాన్ని, ఏ పనిపట్ల ఆసక్తి ఉండేది కాదు. అందుకే వంట చేయకపోవడం, పనులు చేయకపోవడం మంచిదే’’ అని తెలిపారు.

గ్రామీణ సమాజంలో ఇంకా మూఢనమ్మకాలే

ఈ సందర్భంగా ఆమె గ్రామీణ ప్రాంతాల్లో పీరియడ్స్ చుట్టూ ఇంకా రహస్య భావజాలం, ఆధ్యాత్మిక అడ్డంకులు కొనసాగుతున్నాయని గమనించారు. ‘‘మహిళల శరీరంలో సహజంగా జరిగే ఈ ప్రక్రియను సమాజం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకునేలా వాతావరణం కల్పించాలి’’ అని కంగనా పిలుపునిచ్చారు.

స్త్రీలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి..

మహిళల మాసిక సమస్యలను ఓపెన్‌గా చర్చించడం ద్వారా సమాజం మార్పు దిశగా అడుగులు వేయగలదని కంగనా అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చించేలా అవగాహన కార్యక్రమాలు జరగాలని ఆమె సూచించారు.

Tags:    

Similar News