ఈవీఎంలను సీతతో పోల్చిన కమల్‌... తెరపైకి సరికొత్త లాజిక్!

ఇందులో భాగంగా... ప్రజలను మతం పేరుతో వేరు చేయాలని చూస్తున్న ఒక శక్తికి వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే డీఎంకే కూటమికి మద్దతు తెలిపినట్లు తెలిపారు.

Update: 2024-03-24 12:40 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెరపైకి నేతలు చేస్తున్న పలు స్టేట్ మెంట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఈవీఎం లపై ఆసక్తికరమైన మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్. ఇదే సమయంలో డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వడంపైనా స్పందించారు. ఇందులో భాగంగా... ప్రజలను మతం పేరుతో వేరు చేయాలని చూస్తున్న ఒక శక్తికి వ్యతిరేకంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే డీఎంకే కూటమికి మద్దతు తెలిపినట్లు తెలిపారు.

అవును... ఈవీఎంలపైనా, డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వడంపైనా స్పందించిన కమల్ హాసన్... రెండు విషయాల్లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మొదట్లో అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తే చాలని భావించినట్లు తెలిపారు. పైగా... అప్పట్లో రాజకీయలపై తనకు ద్వేషం ఉండటం కూడా అందుకు ఒక కారణం అని అన్నారు.

అయితే.. సమాజంలో మంచి పరిణామాలను రాజకీయాలద్వారా మాత్రమే చేయగలమని తర్వాత గ్రహించడంతోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు కమల్ తెలిపారు. ఈ సమయంలో డీఎంకే కూటమికి మద్దతు ఇవ్వడంపై కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పిన ఆయన... అందుకు గల కారణాన్ని సవివరంగా వివరించారు. ఇందులో భాగంగా... ప్రజలను మతం పేరుతో వేరుచేయాలని చూస్తోన్న వారికి వ్యతిరేకంగా వ్యవహరించాలని భావించానని, ఆ నిర్ణయంతోనే డీఎంకే కూటమిలో చేరినట్లు తెలిపారు.

ఇదే సమయంలో.. ఈవీఎంలపైనా తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఇందులో భాగంగా... ప్రమాధం జరిగితే డ్రైవర్ ది తప్పు కానీ.. కారుది కాదన్నట్లుగానే... మనం ఈవీఇఎం లను టెస్ట్ చేయాలని, ఈ విషయమంలో తాను ఎవరినీ ఎగతాలి చేయడం లేదని అన్నరు. ఈ క్రమంలోనే... రాముడు కూడా సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు కదా అని స్పందించారు కమల్ హాసన్.

Tags:    

Similar News