• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ ప్రభుత్వంలో ఒక్కో...

జగన్ ప్రభుత్వంలో ఒక్కో మంత్రిదీ ఒక్కో అవతారం...!

| ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ బీసీలను ముందు వరసలో నిలబెట్టే బీసీ సంక్షేమం, సమాచార వ్యవహారాల శాఖ మంత్రిగా తాను కీలకంగా ఉన్నానని అన్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-19 11:59 GMT

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో దశావతారాలు ఉన్నాయని ఆసక్తికరమైన కామెంట్స్ ని చేశారు బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కో మంత్రి ఒక్కో అవతారంలో ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్యల మీద సమరం చేస్తున్నారు అని తనదైన విశ్లేషణ వినిపించారు.

ఆయన దృష్టి కోణంలో నుంచి చూస్తే బీసీ మంత్రులు పది మంది జగన్ మంత్రివర్గంలో ఉన్నారని, వారంతా సమస్యలు అనే వాటి మీద దుష్ట శిక్షణ చేస్తూనే అభివృద్ధి పధంలో ఏపీని నడిపిస్తున్నారు అని అన్నారు. గతంలో విష్ణుమూర్తి రాక్షసులను సం హరించడానికి పది అవతారాలు ఎత్తాడని, అలా ఏపీలో పేదరికం అంతం చేయడానికి వైసీపీ ప్రభుత్వంలో పది మంది బీసీ మంత్రులు గట్టిగా కృషి చేస్తున్నారని చెప్పుకున్నారు.

మొదటిగా చూసుకుంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మహిళలను చిన్నారులను ముందుకు నడిపించే శాఖ అన్నారు. అలా ఆమెది మొదటి అవతారం అన్నారు. అలాగే ఏపీలో బడుగులు పేదలతో సహా అందరికీ విద్యాబుద్దులు నేర్పించే కీలకమైన శాఖలో సీనియర్ బీసీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారని అన్నారు. ఆయనది రెండవ అవతారం అన్నారు. అలాగే ప్రజల ఆకలి బాధలను తీర్చే అతి ముఖ్యమైన శాఖలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారని అన్నారు. అలా మూడవ అవతారంగా ఆయన ఉన్నారని చెప్పారు.

ఇక పాడితో పాటు పశు పోషణ, సం రక్షణ వంటి బాధ్యతలను తీసుకున్న మంత్రి సీదరి అప్పలరాజుది నాలుగవ అవతారం అన్నారు. అదే విధంగా ప్రజలు అనారోగ్యం పాలన పడకుండా ఆదుకునే ముఖ్యమైన శాఖను చూస్తున్న వైద్య శాఖ మంత్రి విడదల రజనీది అయిదవ అవతారంగా పేర్కొన్నారు.

రెవిన్యూ భూ సంబంధింత వ్యవహారాలను చూస్తూ పేదలకు అండగా నిలిచే ఆరవ అవతారం రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుది అని అన్నారు. పేదలు అణగారిన వారు చెట్లు పుట్టలలో తలదాచుకుంటూ గూడు లేక బాధపడుతున్న నేపధ్యంలో వారికి సొంత ఇళ్ళను కట్టిస్తూ వారిని గొడుగుగా నిలిచే ఏడవ అవతారం గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది అని అన్నారు.

రెక్కలు ముక్ఖలు చేసుకుంటూ కార్మికులుగా బతుకులు ఈడ్చే వారి బాగోగులు చూసే కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయరాం ది ఎనిమిదవ అవతారం అన్నారు. ఇక పల్లెల అభివృద్ధి గ్రామాల అభ్యుదయం పంచాయతీల వెలుగు కోసం తాపత్రయపడే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడిది తొమ్మిదవ అవతారం అన్నారు.

తనది పదవ అవతారం అని స్వయంగా మంత్రి వేణుగోపాల క్రిష్ణ చెప్పుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తూ బీసీలను ముందు వరసలో నిలబెట్టే బీసీ సంక్షేమం, సమాచార వ్యవహారాల శాఖ మంత్రిగా తాను కీలకంగా ఉన్నానని అన్నారు.

తమ ప్రభుత్వంలో బీసీలకు పది కీలకమైన శాఖలను కేటాయించి జగం సముచితమైన స్థానం కల్పించారని మంత్రి కొనియాడారు. ఇలా ఒక్కో మంత్రి ఒక్కో అవతారం ఎత్తి బీసీలకు పీడిస్తున్న సమస్యల మీద సమరమే సాగిస్తున్నారని ఆయన వివరించడం మాత్రం ఆసక్తిగానే ఉంది.

Tags:    
  • Andhrapradesh 
  • Jagan 
  • Government 
  • Politics 
  • Elections 
  • Ministers 
  • Ushasricharan 
  • Botsasatyanarayana 
  • Politicalnews 
  • SrinivasVenugopalaKrishna 

Similar News

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS