రైల్వే ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీ కొట్టిన ట్రైన్.. అసలేం జరిగిందంటే?

సాధారణంగా రోడ్డుపై రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు..రైల్వే ప్రమాదాలు జరగకుండా రైల్వే గేట్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు.;

Update: 2026-01-23 07:35 GMT

సాధారణంగా రోడ్డుపై రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు..రైల్వే ప్రమాదాలు జరగకుండా రైల్వే గేట్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రైలు వచ్చే సమయంలో పట్టాల మీద వ్యక్తులు గానీ, వాహనాలు గానీ ఉండకుండా.. రైలు వచ్చే 15 నిమిషాల ముందే గేటు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ విషయంలో రైల్వే సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తాజాగా ఝార్ఖండ్ లోని డియోగర్లో ఒక భారీ రైలు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. మరి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం

అసలు విషయంలోకి వెళ్తే.. గోండా - అసన్ సోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒక భారీ ట్రక్కును ఢీ కొట్టింది. రూల్స్ కు విరుద్ధంగా ట్రక్ రైల్వే ట్రాక్ దాటుతూ ఉండగా ట్రక్ ను రైలు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. అంతేకాకుండా రైలు ఇంజన్ భాగం కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.ఈ ప్రమాద సమయంలో అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని సమాచారం. ఈ రైలు ప్రమాదం కారణం చేత ఆ రూట్లో వెళ్లాల్సిన రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

అయితే సిగ్నల్ లో సాంకేతిక లోపం కారణంగానే రైలు గేటు వేయకపోవడంతో.. రైలు వచ్చే విషయం తెలియని వాహనదారులు తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రైల్వే గేట్ కీపర్ పంకజ్ తెలిపిన వివరాల ప్రకారం.." హెవీ ట్రాఫిక్ కారణం చేత గేటు వేయడం కుదరలేదని , ఆ సమయంలోనే గోండా - అసన్ సోల్ ఎక్స్ప్రెస్ రావడంతో ఆ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.ఈ క్రమంలోనే అక్కడ ఉండే రెండు ద్విచక్ర వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు తృటిలో ప్రాణాలతో తప్పించుకున్నారని, ఒకవేళ రైలు వేగం అధికంగా ఉండి ఉంటే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అలాగే ఆస్తి నష్టం , ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉండేదని తెలియజేస్తున్నారు.

ఈ ఘటన తెలిసిన వెంటనే రైల్వే అధికారులు.. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా.. గంటల వ్యవధిలోనే లైన్లను క్లియర్ చేశారు. ఈ ఘటన పైన నలుగురు సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి ఈ ఘటనకు కారణమైన వారికి కఠినమైన శిక్ష విధించేలా నిర్ణయాలు తీసుకుంటామంటూ అధికారులు తెలియజేశారు.




Tags:    

Similar News