జేసీ అంటే వెరైటీనే మరి...జస్ట్ కౌన్సిలర్ గిరి !
ఇక తాడిపత్రిలో మొత్తం మున్సిపాలిటీలోని 48 వార్డులు ఉంటే అందులో 30 వార్డులలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారంగా ఉంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు అంటే తెలియని వారు ఉండరు, వారిది దశాబ్దాల రాజకీయ జీవితం. జేసీ దివాకర్ రెడ్డి వైయస్సార్ చంద్రబాబు సమకాలీనుడు. ఆయన ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. చివరి సారిగా అనంతపురం ఎంపీగా 2014లో గెలిచి ఆ మీదట విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇంకా యాక్టివ్ గానే పొలిటికల్ గా ఉన్నారు ఆయన 2014లో తొలిసారి తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆయన వారసుడు అస్మిత్ రెడ్డిని బరిలోకి దించితే ఓటమి పాలు అయ్యారు. అయితే 2024లో గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎమ్మెల్యే నుంచి అలా :
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయం రూటే సెపరేట్ గా సాగుతోంది. ఆయన మున్సిపల్ చైర్మన్ గా తాడిపత్రికి అనేక సార్లు వ్యవహరించారు. 1987–1992, 2000–2005 2005–2010, అలాగే 2021-2026 దాకా ఇలా మొత్తం నాలుగు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. ఆయన 2021లో గెలవడం ఒక అద్భుతం. ఏకంగా టీడీపీకే స్పూర్తిగా నిలిచారు. వైసీపీ ప్రభంజనంలో కూడా తాడిపత్రి నిలబెట్టుకున్నారు. ఆనాడు ఆయన 24 వ వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ చేయడానికి సిద్దపడ్డారు. అప్పట్లో అదే పెద్ద న్యూస్. అయితే ఆయన 304 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్లు గా టీడీపీ వారే ఎక్కువగా గెలిచారు. కాబట్టి వారి మద్దతుతో ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు.
కట్ చేస్తే కౌన్సిలర్ గా :
అయితే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మంత్రి పదవి కోరుకుంటారు. లేదా ఎంపీగా పోటీ చేస్తారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం సడెన్ గా కౌన్సిలర్ గా పోటీ అనేశారు. ఆ మీదట మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంటే ఓకే. ఈసారి కూడా ఆయన 37వ వార్డు నుండి కౌన్సిలర్ గానే నిలబడ్డారు అది కూడా ఏకగ్రీవం అయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి టీడీపీ ఎటూ గెలుస్తుంది కాబట్టి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ చైర్మన్ అవుతారు అనుకోవచ్చు. అక్కడే తకరారు ఉంది. చైర్మన్ పదవి బీసీ జనరల్ కి రిజర్వ్ అయింది. అంటే జేసీ కౌన్సిలర్ గా గెలిచినా చైర్మన్ కాలేరు అన్నది తేలిపోతోంది. కానీ అన్నీ తెలిసి ఆయన ఎందుకు ఇలా కౌన్సిలర్ గా ఉండేందుకు రెడీ అయ్యారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.
చైర్మన్ గా ఎవరంటే :
ఇక తాడిపత్రిలో మొత్తం మున్సిపాలిటీలోని 48 వార్డులు ఉంటే అందులో 30 వార్డులలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారంగా ఉంది. ఇక మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి టీడీపీ నేతృత్వంలోని కూటమి తరఫున రేష్మా పర్వీన్ అభ్యర్థిగా ఉండగా ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి ఫయాజ్ బాషా పోటీ చేస్తున్నారు. అలా చైర్మన్ పదవికి అధికార కూటమి, వైసీపీ రెండూ ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి అన్న మాట. ఎటూ కూటమికే ఏకగ్రీవాలు అధికంగా ఉన్నాయి కాబట్టి చైర్మన్ గా రేష్మా పర్వీన్ ఉంటారని తేలిపోతోంది. మరి ప్రభాకర్ రెడ్డి జస్ట్ కౌన్సిలర్ గానే ఉంటారా ఏమిటి అన్నదే ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే ఆయన డిప్యూటీ చైర్మన్ గా ఉండొచ్చు అని ప్రచారం సాగుతోంది. లేకపోతే కౌన్సిలర్ గా కూడా ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అంటే ఎమ్మెల్యే తరువాత చైర్మన్ ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ లేదా కౌన్సిలర్ అన్న మాట. ఏదేమైనా జేసీ రాజకీయమే వెరైటీ కదా అని అంటున్నారు.
తాడిపత్రి మీద ప్రేమ :
అయితే జేసీకి తాడిపత్రి పట్టణం మీద ఎంతో ప్రేమ అని అందుకే ఆయన ఈ విధంగా మునిసిపాలిటీలో పదవి ఏదైనా బాధ్యత తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఇక దశాబ్దాలుగా తాడిపత్రి పట్టణంలో ఆయన ఎక్కువగా సమయం గడుపుతూ వస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని అనేక ప్రాంతాలను సందర్శిస్తూ స్థానికంగా ఉన్న ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని వాటిని పరిష్కరిస్తారని మంచి పేరు పొందారు. అందుకే జేసీకి పదవులు హోదాలు ముఖ్యం కావు. ఆయనకు తాడిపత్రితో అనుబంధమే అతి ముఖ్యమని అంటున్నారు. దటీజ్ ప్రభాకరరెడ్డి.