• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమిత్ షా కొడుకంటే అలానే...

అమిత్ షా కొడుకంటే అలానే ఉంటాది మరి

| గడిచిన కొంతకాలంగా బీసీసీఐను శాసిస్తున్న వ్యక్తిగా జై షా మారారు. ఇప్పుడు ఆయన.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చేశారు.

By - Tupaki Desk
Update: 2024-08-21 04:30 GMT

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి పుత్రరత్నాలు అంతే పవర్ ఫుల్ పదవుల కోసం తపించటం కొత్తేం కాదు. కానీ.. నిత్యం నీతులు చెప్పే బీజేపీ అగ్రనేతలకు సంబంధించి ఇలాంటివి చోటు చేసుకోవటం మాత్రం కాస్తంత ఆసక్తికర అంశమే. ఇప్పటికే భారత క్రికెట్ లో చక్రం తిప్పుతున్న అమిత్ షా కుమారుడు జై షా.. బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో పవర్ ఫుల్ పోస్టు మీద కన్నేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

గడిచిన కొంతకాలంగా బీసీసీఐను శాసిస్తున్న వ్యక్తిగా జై షా మారారు. ఇప్పుడు ఆయన.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులోకి వచ్చేశారు. మామూలు వ్యక్తులకు ఇది సాధ్యమయ్యేది కాదు. అమిత్ షా లాంటి అత్యంత పవర్ ఫుల్ నేత కుమారుడికి ఉండే అవకాశాలు వేరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న గ్రెగ్ బార్ క్లే రెండో దఫా పదవీకాలం ఈ నవంబరు 30తో ముగియనుంది. న్యూజిలాండ్ కు చెందిన ఈ పెద్ద మనిషి ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం చూస్తే.. ఒక వ్యక్తి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్ పదవిలో గరిష్ఠంగా మూడుసార్లు కొనసాగే వీలుంది. ప్రతిసారి రెండేళ్లు ఆ పదవిలో ఉండే వీలుంది. అంటే.. ఆరేళ్లు కొనసాగే వీలుంది.

అయితే.. గ్రెగ్ మాత్రం మూడోసారి ఆ పదవిలో కంటిన్యూ అయ్యేందుకు ఆసక్తిని చూపటం లేదు. దీంతో.. కొత్త ఛైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో అమిత్ షా కుమారుడు జై షా పేరు ఛైర్మన్ రేసులో వినిపిస్తోంది. ఈ నెల 27లోపు ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జై షా అధికారికంగా రంగంలోకి రావటమే మిగిలి ఉందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Cricket 
  • Bcci 
  • Icc 
  • Jayshah 
  • Indiancricket 
  • Amitshah 
  • Sports 
  • Politicalnews 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS