• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరో తొమ్మిది స్థానాల్లో ...

మరో తొమ్మిది స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఖరారు!

| రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-03-14 04:33 GMT

రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన.. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సార్దుబాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని.. అనంతరం కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయించారు! అలా ఆరుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరొ 9 పేర్లను కన్ ఫాం చేసినట్లు తెలుస్తుంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలూ దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 94 మంది అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదే సమయంలో ఇప్పటికే 12 విడతల్లో సుమారు 70కి పైగా అభ్యర్థులను అసెంబ్లీకి, 23 మంది అభ్యర్థులను లోక్ సభ కు కేటాయించిన జగన్... ఈ నెల 16న ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా మొత్తం అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా పార్టీ అభ్యర్థులు, నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని వారికి దిశానిర్ధేశం చేశారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులతో పాటు.. మరికొంతమంది నేతలతోనూ ఆయన మంగళగిరి ఆఫీసులో ముఖాముఖీ చర్చించారు. ఈ సందర్భంగా ఆ భేటీకి హాజరైన వారే అభ్యర్థులు అని తెలుస్తుంది. ఇందులో భాగంగా మరో 9 పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఇప్పటికే ప్రకటించిన ఆరుగురు అభ్యర్థులతో పాటు ఈ రోజు మరో తొమ్మిది మంది అభ్యర్థులను జనసేనాని ప్రకటించనున్నారని తెలుస్తుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయని అంటున్నారు.

పెందుర్తి - పంచకర్ల రమేష్

ఎలమంచిలి – విజయ్ కుమార్

విశాఖ సౌత్ - వంశీకృష్ణ యాదవ్

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

నరసాపురం - బొమ్మిడి నాయకర్

భీమవరం - రామాంజనేయులు

రాజోలు - దేవ వరప్రసాద్

తిరుపతి - ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాలను జనసేనాని కన్ ఫాం చేశారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు అధికారిక ప్రకటన ఉండొచ్చని సమాచారం.

Tags:    
  • Janasena 
  • APelections 
  • Candidates 
  • Bjp 
  • Tdp 
  • Allaince 
  • pawankalyan 
  • Chandrababunaidu 
  • Ysrcp 
  • Panchakarlaramesh 
  • Vijaykumar 
  • Vamsikrishnayadav 

Similar News

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

Copyright @2026

Powered by Blink CMS