• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్, నాగబాబుపై అంబటి ...

పవన్, నాగబాబుపై అంబటి సెటైర్లు.. జగన్ పై జనసేన కౌంటర్లు!

| దీనిపై అంబటి రాంబాబు నుంచి సెటైర్లు పడగా.. జగన్ పై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

By - Tupaki Desk
Update: 2025-03-07 12:55 GMT

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారిణి వనితా రాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనిపై అంబటి రాంబాబు నుంచి సెటైర్లు పడగా.. జగన్ పై జనసేన ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్, నాగబాబుని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... "అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!" అని అంబటి రాంబాబు పోస్ట్ చేశారు. దీంతో... ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేయడం మొదలుపెట్టింది. కామెంట్ సెక్షన్ లో వైసీపీ వర్సెస్ జనసేన వార్ స్టార్ట్ అయ్యింది!

అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan

— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025

ఈ సమయంలో జనసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఇందులో భాగంగా... తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ లేకపోతే జగన్ కౌన్సిలర్ కూడా కాలేరని అన్నారు.

ఈ సందర్భంగా స్పందిస్తూ... "అంబటి రాంబాబు చెబుతూ.. పుడతానే ఎంపీ పదవితో పుట్టారు జగన్ మోహన్ రెడ్డి అని.. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే.. జగన్ మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా.. కనీసం కౌన్సిలర్ కూడా అవ్వలేరు" అని అన్నారు.

కాగా... వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఇటీవల పవన్ స్పందిస్తూ.. సీట్ల ప్రకారం చూస్తే వైసీపీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని, అలా రావాలంటే జర్మనీ వెళ్లాలంటూ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జగన్...పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

ఎవడివి నువ్వు “రాజశేఖర్ రెడ్డి” లేకపోతే!! మీ నాన్న ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే కనీసం “కౌన్సిలర్” కూడా అవ్వలేవు నువ్వు @ysjagan @JanaSenaParty @PawanKalyan pic.twitter.com/9p4wxwaKDk

— JSP WestGodavari (@JSPWestGodavari) March 7, 2025
Tags:    
  • NagaBabu 
  • MLC 
  • Janasena 
  • TDP 
  • BJP 
  • AmbatiRambabu 
  • PawanKalyan 
  • AndhraPolitics 
  • YSRCP 
  • PoliticalClash 
  • TeluguPolitics 
  • Elections2024 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS